జాతీయ వార్తలు

కౌంట్‌డౌన్ మొదలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న జెడీఎస్, కాంఅగెస్ సంకీర్ణ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. విశ్వాస తీర్మానంపై సోమవారం ఓటింగ్ జరగడం, అది వీగిపోవడం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఒకవేళ విశ్వాస పరీక్షను వాయిదా వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కూడా సోమవారం ఓటింగ్‌కు వెళుతున్నట్టు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వీరిద్దరూ మాట నిలబెట్టుకుంటారనే అనుకుంటున్నానని, కర్నాటక సంక్షోభానికి సోమవారం తెరపడుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 225 మంది సభ్యులు ఉండగా, అధికారంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 117 మంది మద్దతు ఉంది. వారిలో 78 మంది కాంగ్రెస్ సభ్యులుకాగా, 37 మంది జేడీఎస్ సభ్యులు. బీఎస్పీకి చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతు కూడా సర్కారుకు ఉంది. సర్కారుకు మద్దతుస్తున్న వారిలో స్పీకర్, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కాగా, 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే, స్పీకర్‌ను మినహాయించి, సర్కారుకు అండగా నిలిచేవారి సంఖ్య 101కి పడిపోతుంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ సభకు వచ్చే అవకాశం లేదు. కాగా, బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. తమ పార్టీ నేత మాయావతి ఆదేశాల కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు సమాచారం. ఇలావుంటే, సభలో బీజేపీకి 107 మంది మద్దతునిస్తున్నారు. మొత్తం మీద కర్నాటక రాజకీయం రసవత్తరంగా కొనసాగుతున్నది. రాజ్యాంగ సంక్షోభం వైపు దారితీస్తున్నది. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతున్నది.
చిత్రం...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప