జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 21: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని ఏజన్సీలు తమ పార్టీ నాయకులను, చిట్‌ఫంట్ కుంభకోణంలో ఇరుకున్న పలువురు తమ ప్రజాప్రతినిధులను బీజేపీలో చేరాలని లేకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ బెదిరిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆదివారం ఇక్కడ జరిగిన అమరుల దినోత్సవ ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కాషాయదళం నాయకులు నగదు లేదా ఇతర రూపాల్లో తమకు చెల్లించాలని టీఎంసీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలిసారిగా జరిగిన ప్రధాన రాజకీయ ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ బీజేపీ నాయకులు తమ పార్టీ నాయకుల నుంచి బలవంతంగా వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపారు. బీజేపీ నాయకులతో ‘టచ్’లో ఉండాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తమ నాయకులను బెదిరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ‘కర్నాటకలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చందంగానే ఇక్కడ కూడా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కాషాయదళంలో చేరితే పెట్రోల్ పంపుతోపాటు రెండు కోట్ల రూపాయలు ఇస్తామంటూ మా ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తున్నారు’ అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. దేశంలో సమాఖ్య నిర్మాణాన్ని ఛిద్రం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. విచిత్రమైన ధోరణులను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు రెండేళ్లకు మించి నిలదొక్కుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో 13 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరణించారు. ఆ సమయంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ వ్యవహరించారు. అప్పటినుంచి వారి స్మారకార్థం ఏటా జూలై 21న ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలంతా ముందుకు రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్ష పార్టీ పాలనలో మరణించిన కాంగ్రెస్ కార్యకర్తల స్మారకార్థం ఆదివారం ఇక్కడ జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. 1993 జూలై 21న జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలను ఆమె ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
మళ్లీ బ్యాలెట్ విధానాన్ని తీసుకురండి
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అనుసరిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తీసుకురావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నల్లధనాన్ని అరికట్టేందుకు తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్ననీ, అమెరికా వంటి అగ్రదేశాల్లో గతంలో ఈవీఎంలను ఉపయోగించిన విషయాన్ని మరువరాదు. కానీ ఇపుడు ఆయా దేశాల్లో వాటిని నిలుపుచేశారు. అలాంటపుడు మన దేశంలో కూడా బ్యాలెట్ పద్ధతిని మళ్లీ ఎందుకు వెనుకకు తీసుకురాకూడదు’ అని ఆమె ప్రశ్నించారు. దేశంలో ఎన్నికల సంస్కరణల్లో సమూలమైన మార్పులు తీసుకురావాలని తాను 1995 నుంచి కూడా డిమాండ్ చేస్తున్నానని, దీనివల్ల ఇటు నల్లధనాన్ని అరికట్టడంతోపాటు రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించేందుకు ఆస్కారం ఉంటుందని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతామని ఆమె ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను రాజకీయ పార్టీలు వెచ్చించిన విషయాన్ని ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రస్తావించారు.
చిత్రాలు.. ఆదివారం కోల్‌కతాలో జరిగిన భారీ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న మమతా బెనర్జీ