జాతీయ వార్తలు

ఐదేళ్లలో మంచి రోజులు తెచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత దేశానికి ‘మంచి రోజులు వచ్చాయి’ అని బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారత్) అంటే అవినీతి రహిత దేశం రావాలని కోరాం.. ‘అచ్చే దిన్ ఆయెంగే’ మంచి రోజులు వస్తున్నాయి అని 2014 సంవత్సరం ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్పిందనీ.. అదే లక్ష్యంగా పనిచేశామని ఆదివారం ముంబయిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నడ్డా పేర్కొన్నారు. ‘ఈ ఐదేళ్లలో బీజేపీ చెప్పినట్లే భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని గుర్తు చేస్తున్నామని‘ నడ్డా స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఏయే రంగాల్లో సత్ఫలితాలు సాధించిందన్న అంశాన్ని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య రంగం, పేదరిక నిర్మూలన, వౌలిక వసతులు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పురోగతి సాధించామని స్పష్టం చేశారు. దేశంలో ‘రాజకీయ సంస్కృతి’నే బీజేపీ మార్చివేసిందని నడ్డా చెప్పారు. సేవలు, అభివృద్ధిని కింది స్థాయినుంచి బలోపేతం చేయగలిగామని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు మోదీ ప్రభుత్వ హయాంలో ‘ఓటు బ్యాంకు, కుల రాజకీయాల’ను తిప్పి కొట్టగలిగామన్నారు. ‘ప్రపంచాన్ని గమనించడం.. స్థానికంగా పనిచేయడం’ బీజేపీ కార్యకర్తల ప్రధాన ధ్యేయమని కావాలని ఆయన సూచించారు. 2014కు ముందు భారత దేశమంటే అవినీతి దేశమన్న అభిప్రాయం ఉండేదనీ.. వీదేశాంగ విధానం నీరుగారిపోయిందని.. దిశా నిర్దేశం చేసే వారే లేకపోయారని నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందని.. భారత్‌లో పుట్టిన ప్రవాసులంతా దేశాన్ని చూసి గర్వపడుతున్నారని స్పష్టం చేశారు. యుఏఈ, ఇజ్రాయెల్, రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత్ అభివృద్ధిని చూసి ప్రధాని మోదీని అభినందిస్తున్నాయని నడ్డా పేర్కొన్నారు.