జాతీయ వార్తలు

నన్నిక్కడే ఉండనివ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: మరో ఏడాది పాటు భారత్‌లో ఉండేందుకు గడువు లభించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ హర్షం వ్యక్తం చేసింది. అయితే, ఇలా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా లేదా ఎక్కువ కాలం ఇక్కడే ఉండే విధంగా అనుమతులు మం జూరు చేయాలని 54 ఏళ్ల తస్లిమా సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘నేను భరత మాత ముద్దుబిడ్డను.. ఇలా ఏడాదికోసారి అనుమతి పొడిగిస్తూ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఐదు లేదా పదేళ్లపాటు భారత్‌లో ఉండే విధంగా అనుమతి ఇవ్వాలని’ అభ్యర్థించింది. పదేళ్లపాటు ఇక్కడ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ‘నేను భారత్‌లోనే ఉండాలని కోరుకొంటున్నాను.. శేష జీవితం ఇక్కడే గడపాలని భావిస్తున్నందున నాకీ అవకాశం ఇవ్వాలని’ మాజీ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను 2014లోనే కోరానని ఆమె పేర్కొన్నారు. తస్లిమా నస్రీన్‌కు మరో ఏడాది పాటు భారత్‌లో ఉండే విధంగా హోం శాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. గత వారం తస్లిమాకు భారత ప్రభుత్వం మూడు నెలలు భారత్‌లో ఉండేలా ఆదేశాలిచ్చింది. అయితే, హోం మంత్రి అమిత్‌షాను అభ్యర్థించిన నేపథ్యంలో ఏడాది పాటు ఇక్కడ నివసించేలా ఉత్తర్వులను జారీ చేసింది. ‘నన్ను విదేశీయురాలుగా గుర్తిస్తున్నారు.. ఇక్కడి మట్టికే పుట్టానని భావిస్తుంటాను.. అందువల్ల ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన లేదా ఎక్కువ కాలం ఉండేలా అనుమతిని మంజూరు చేయాలని కోరుకొంటున్నా’నని తస్లిమా నస్రీన్ స్పష్టం చేశారు.