జాతీయ వార్తలు

ఉగ్రకోట రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూలై 22: కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాద స్థావరం దాడిచేసి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. దోడా ఎస్పీ (ఆపరేషన్స్) ఆర్‌పీ సింగ్ కథనం మేరకు.. మధాన్-చంచలు అటవీ ప్రాంతంలోని గొండా ప్రాంతంలోని స్థావరాన్ని కనుగొన్నారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూపు (ఎస్‌వోజీ), స్థానిక పోలీసులు, నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా స్థావరంపై దాడి చేశారు. స్వాధీనం చేసుకొన్న వాటిలో చైనీస్ పిస్టల్‌తో పాటు ఎనిమిది రౌండ్ల రాకెట్ గన్, గ్రెనేడ్ లాంచర్, 581 రౌండ్ల 11 ఏకే 47 తూటాలు, ఐదు ఎస్‌ఎల్‌ఆర్ తూటాలు, పిస్టల్ తూటాలు, 188 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. కాగా, స్వాధీనం చేసుకొన్న ఆయుధ సామాగ్రిలో అధిక శాతం తుప్పు పట్టి ఉన్నాయి. ‘దాదాపు దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన స్థావరం ఇది.. తుప్పు పట్టిన ఆయుధాలను గమనిస్తే పదేళ్ల నాటివని తెలుస్తోంది’ అని ఎస్పీ వివరించారు. ఎవరినీ అరెస్టు చేయలేదని.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

చిత్రాలు.. స్వాధీనం అయిన ఆయుధాలు