జాతీయ వార్తలు

నన్ను బలిపశువును చేయకండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 22: కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష వ్యవహారం సోమవారం అయోమయ చందంగానే సాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం ఈ వ్యవహారాన్ని తేల్చేస్తానని స్పీకర్ రవికుమార్ చెప్పినప్పటికీ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూడా కర్నాటక అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులే రాజ్యం చేశాయి. ఒకదశలో సహనం కోల్పోయిన స్పీకర్ ‘మనల్ని అందరూ చూస్తున్నారు, నన్ను బలిపశువును చేయకండి, బలపరీక్ష వ్యవహారాన్ని పూర్తి చేద్దాం..’ అని సభ్యులను అభ్యర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు మరింత వ్యవథి కావాలంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన అభ్యర్థనను తిరస్కరించిన స్పీకర్ విశ్వాస తీర్మానంపై తమ ప్రసంగాలను త్వరితగతిన ముగించాలని సభ్యులను కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సమర్పించిన రాజీనామాల వ్యవహారాన్ని తేల్చకుండా విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరిగేందుకు వీలు లేదని కాంగ్రెస్ సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి అడుగడుగునా సభ్యులను శాంతించండి అంటూ అభ్యర్థించడంతోనే స్పీకర్‌కు సరిపోయింది. సోమవారం ఈ వ్యవహారాన్ని తేల్చేస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పదేపదే కోరారు. గందరగోళ పరిస్థితుల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. సభ్యులు వ్యవహారిస్తున్న తీరు వల్ల ఇటు సభకు గాని, అటు తనకు గాని ఎలాంటి గౌరవం కలగదని ఒక దశలో స్పీకర్ తీవ్ర స్వరంతోనే వ్యాఖ్యానించారు. విశ్వాస ఓటు ఎంత మాత్రం వాయిదా పడడానికి వీల్లేదని చాలా స్పష్టమైన రీతిలోనే సంకేతాలు అందిస్తూ వచ్చారు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా అంశంపై స్పీకర్ నిర్ణయం తేలకుండా విశ్వాస తీర్మానంపై ఓటింగ్ పెడితే ఈ ప్రక్రియకు ఎలాంటి విలువ ఉండదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి బైరగౌడ చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ముందుగా రాజీనామాల వ్యవహారంపై స్పీకర్ తేల్చాలని ఆయన కోరారు. ఇది తేలకుండా విశ్వాస ఓటుకు ఎలాంటి విలువ ఉండదన్న వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదన్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కర్నాటకలో బీజేపీ చేస్తున్న వ్యవహారం కూడా ఇందులో భాగమేనని అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని రెబెల్ ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆయన అభ్యర్థించారు. కాగా ఎలాగైనా ఈ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునే వ్యూహంతోనే విశ్వాస పరీక్ష జరగకుండా అధికార కూటమి
అడ్డుపడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ రోజే (సోమవారం) విశ్వాస తీర్మానంపై ఓటింగ్ పూర్తి చేయాలని, నిరంతరంగా దీనిని వాయిదా వేయడానికి వీల్లేదని బీజేపీ సీనియర్ నేతలు జగదీష్ షట్టర్, మధుస్వామి స్పష్టం చేశారు. గత గురువారం నుంచి కుమారస్వామి విశ్వాస పరీక్ష వ్యవహారం కర్నాటక రాజకీయ సంక్షోభాన్ని మరింత ముదరపెడుతూనే వచ్చింది. 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీ(ఎస్) సభ్యులు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోపక్క ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వ భవిత ఢోలాయమానంగా మారింది. అసెంబ్లీలో అధికార కూటమికి 117 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యుల మద్దతుతో బీజేపీ సభ్యుల సంఖ్య 107 అవుతుంది. 15 మంది ఎమ్మెల్యేల (12 కాంగ్రెస్, ముగ్గురు జేడీ-ఎస్) రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా, ఓటింగ్‌లో వీరు పాల్గొనకపోయినా అధికార కూటమి బలం 101కి పడిపోతుంది. ఇదిలాఉండగా కర్నాటక అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరగాలంటూ ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తాజాగా దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. వెంటనే దీనిపై విచారణ జరగాలంటూ ఎమ్మెల్యేలు శంకర్, నగేష్‌లు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.

చిత్రం... కర్నాటక అసెంబ్లీలో మాట్లాడుతున్న స్పీకర్ రవికుమార్