జాతీయ వార్తలు

రాజ్యసభకు కర్నాటక సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కర్నాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం మూలంగా రాజ్యసభ సోమవారం మూడుసార్లు వాయిదా పడింది. కర్నాటకలో రాజకీయ సంక్షోభంతోపాటు, సోన్‌భద్ర కాల్పులు, మూకదాడులపై కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, డిఎంకే, ఆప్ పార్టీలకు చెందిన సభ్యులు చర్చించాలని పట్టుబట్టడంతో సభ వరుసగా మూడుసార్లు వాయిదా పడింది. సభ ప్రారంభ కాగానే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షిలాదీక్షిత్ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను చైర్మన్ వెంకయ్య నాయుడు సభకు సమర్పింప చేశారు. రోజువారీ సభా కార్యక్రమాలను పక్కనబెట్టి 267వ నిబంధన కింద వివిధ అంశాలపై సభలో చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు నోటీసు ఇచ్చారు. కర్నాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ నేత హరిప్రసాద్.. దళిత, గిరిజనులపై ముకదాడులపై వామపక్ష నాయకులు భినయ్ విశ్వం, కరీం.. సోన్‌భద్ర ఘటనపై టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్‌రాయ్ చర్చ చేపట్టాలని ఇచ్చిన నోటీసులు తిరస్కరించినట్టు చైర్మన్ వెంకయ్య స్పష్టం చేశారు. దీనిపై చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టబట్టాయి. అందుకు చైర్మన్ నిరాకరించారు. కర్నాటక అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందున సభలో చర్చించలేమని చైర్మన్ వెల్లడించారు. దీనికి శాంతించని ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. సభను సజావుగా సాగేందుకు సహకరించాలని పలుమార్లు చైర్మన్ విజ్ఞప్తి చేసినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రశ్నోత్తారాల సమయాన్ని కొనసాగేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివాదాలిచ్చారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. రెండు గంటల తరువాత మానవ హక్కుల పరిరక్షణ సవరణ బిల్లుపై చర్చను కొనసాగించేందుకు డిఫ్యూటీ చైర్మన్ ప్రయత్నించారు. దీన్ని విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్యనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చను కొనసాగించేందుకు సభ్యులు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ కోరారు. అయినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. పోడియం వద్దకు వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. సభ సజావుగా లేకుండా సభను నడిపించడం సరికాదని టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు, కాంగ్రెస్ పక్ష ఉపనేత అనంద్ శర్మ డిప్యూటీ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.
సభ్యుల నినాదాల మధ్యనే మానవ హక్కుల పరిరక్షణ సవరణ బిల్లుపై చర్చను కొనసాగించారు. ఈ సమయంలో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో డిప్యూటీ చైర్మన్ సభను మూడు గంటలకు వాయిదా వేశారు. ఆ తరువాత సభలో మానవ హక్కుల పరిరక్షణ సవరణ బిల్లుపై చర్చ కొనసాగింది.

చిత్రం... రాజ్యసభ మధ్యకు వచ్చి ఆందోళన చేస్తున్న సభ్యులు