జాతీయ వార్తలు

పంజాబ్‌లో కేజ్రీవాల్ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఏప్రిల్ 1: ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులకు ఇది శుభవార్త. పంజాబ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన నేతృత్వం వహిస్తున్న పార్టీ ఆప్ హవా వీస్తోందని తాజా సర్వే వెల్లడించింది. హుఫ్‌పోస్ట్-సి ఓటర్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయదుందుభి మోగిస్తుంది. 117 సీట్లున్న అసెంబ్లీలో ఆప్‌కు 94నుంచి 100 సీట్లు వస్తాయి. అంటే గత సంవత్సరం ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే రాష్ట్రంలో ఆప్‌కు ప్రజల మద్దతు మరింత పెరిగింది. అప్పట్లో సిఓటర్-హుఫ్‌పోస్ట్ నిర్వహించిన సర్వేలో ఆప్‌కు 83 నుం చి 89 సీట్లు వస్తాయని తేలింది. తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 8-14 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుంది. 2015 ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌కు 12-18 స్థానాలు లభిస్తాయని తేలింది. అధికార శిరోమణి అకాలీదళ్-బిజెపి కూటమికి కేవలం 6-12 సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. ఏడాది క్రితం నిర్వహించిన సర్వే ఈ కూటమికి 13-19 సీట్లు లభిస్తాయని పేర్కొంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆప్‌కు ఓటేస్తామని సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంటే తీవ్ర స్థాయి లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఇది సూచిస్తోంది. తాజా సర్వే ప్రకారం, పంజాబ్ ప్రజల్లో అత్యధికులు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 51 శాతం మంది సిఎం పదవికి కేజ్రీవాల్ పట్ల సుముఖంగా ఉన్నా రు. 59 శాతం మంది కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి కావాలని 35 శాతం మంది, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ ముఖ్యమంత్రి కావాలని 7శాతం మంది కోరారు.
నిరుద్యోగం, మాదకద్రవ్యాల వినియోగం, అవినీతిని పంజాబ్ ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలుగా గుర్తించారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) 56 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 46 స్థానాల్లో, బిజెపి 12 స్థానాల్లో విజయం సాధించాయి.