జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌ఐలకు 272 పద్మ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: వివిధ కారణాలతో విదేశాల్లో ఉంటూ సేవలందిస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు (ప్రవాస భారతీయులు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, భారతీయ సంతతికి చెందిన వారితో కలిపి 1954 సంవత్సరం నుంచి 272 మందికి పద్మ అవార్డులు ఇవ్వడం జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో విపక్ష సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 272 మంది విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐలు/ఒసీఐఎస్/పిఐవోలకు పద్మ అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. డాక్టర్లు, శాస్తవ్రేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవలందిస్తున్న వారిని ఎంపిక చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని పద్మ అవార్డుల ఎంపిక కమిటీ నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తుందన్నారు. అవార్డుల ఎంపికకు తర, తమ వంటి నియమాలు ఏమీ లేవని ఆయన తెలిపారు.