జాతీయ వార్తలు

అమిత్ షాను కలిసిన శ్రీలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్‌పై పని చేసేందుకు అవకాశం కల్పించాలని ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులను ఆమె మంగళవారంనాడు పార్లమెంట్‌లో కలిశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణం చేసిన తరువాత ఆయనతో శ్రీలక్ష్మి భేటీ అయ్యారు. ఏపీలో పనిచేస్తానని ఆమె జగన్‌ను విజ్ఞప్తి చేయగా, దీనికి ఆయన సానుకులంగా స్పందించారు. ఈ మేరకు ఆమెను ఏపీ క్యాడర్‌కు బదలాయించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయినా ఇప్పటివరకు కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఆమె మంగళవారంనాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులను కలిసి తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్‌కు బదిలీ చేయాలని కోరారు. కాగా, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి అమిత్ షా, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులను ఆమె కలిసేలా చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది.