జాతీయ వార్తలు

ప్రపంచాన్ని కాపాడుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: పర్యావరణ మార్పుల ఫలితంగా తలెత్తుతున్న విపరీత పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక రాయబారి లూయిస్ అల్బా పిలుపునిచ్చారు. 2030 నాటికి కర్బన్ ఉద్గారాల విసర్జన పరిమాణాన్ని 40 శాతానికి కుదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సురక్షిత జీవనానికి ఈ లక్ష్య సాధన ఎంతైనా అవసరం అని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో త్వరలో జరగబోతున్న వాతావరణ మార్పుల నిరోధక కార్యాచరణ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ శిఖరాగ్ర సదస్సు అర్థవంతంగా సాగేందుకు వీలుగా ప్రపంచ దేశాలు వ్యాపార సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు కఠినమైన ప్రతిపాదనలతో ఆశయాలతో ముందుకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఉష్ణోగ్రత 3 డిగ్రీల మేర పెరుగుతోందని, దీనిని 1.5 డిగ్రీలకు తగ్గిస్తే తప్ప ఈ ప్రపంచంలో జీవ జాతుల మనుగడకు ఎంత మాత్రం ఆస్కారం ఉండదని ఆయన హెచ్చరించారు.
ఈ విపరిణామంపై ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టి సారించి కర్బన్ ఉద్గార విసర్జన పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలని ఆయన కోరారు. వాతావరణ కాలుష్యంతో పాటు పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణం కర్బన్ ఉద్గారాలను మితిమీరిన స్థాయిలో విసర్జించడమేనని తెలిపారు. దీనిని నిరోధించాలంటే ప్రపంచ దేశాలన్నీ సంయుక్త కార్యాచరణతో ముందుకు రావడం ఎంతైనా అవసరమన్నారు. వాతావరణ సంక్షోభాన్ని ఉమ్మడి ప్రాతిపదికగా ప్రపంచ దేశాలు ఎదుర్కొగలిగితే ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని పెంపొదించడంతో పాటు జీవన నాణ్యతను ఇనుమడించే అవకాశం ఉంటుందని, అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలోనూ గణనీయమైన పురోభివృద్ధి సాధ్యమవుతుందని లూయిస్ అల్బా వెల్లడించారు. సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో పర్యావరణ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. రెండు రోజుల పర్యాటనార్థం భారత్ వచ్చిన అల్బా విస్తృత స్థాయిలో వివిధ వర్గాలతో మంతనాలు జరిపారు. వాతావరణ మార్పులు ఊహించిన దాని కంటే చాలా వేగంగానే చోటు చేసుకుంటున్నాయని, వీటిని నిరోధించాలంటే సామాజికంగా, నిధుల పరంగా రాజకీయంగా కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ మార్పుల నిరోధనతో పాటు ప్రపంచ ప్రజల జీవన నాణ్యత ఆరోగ్యం మెరుగుపడాలంటే 2030 కల్లా కాలుష్య విసర్జన పరిమాణాన్ని 40 శాతానికి తగ్గించడం అత్యవసరం అన్నారు.

చిత్రం...ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక రాయబారి లూయిస్ అల్బా ఆటోలో ప్రయాణిస్తున్న దృశ్యం