జాతీయ వార్తలు

ఫ్లైఓవర్ ప్రమాద ఘటనలో ఐదుగురు అధికారుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 1: కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వంతెన ప్రమాదం ఘటనకు సంబంధించి ఐదుగురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఐవిఆర్‌సిఎల్ అనే కంపెనీ ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తోంది. శిథిలాల నుంచి శుక్రవారం మరో మూడు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో ఫ్లైఓవర్ కూలిపోయిన మృతి చెందినవారి సంఖ్య 24కు చేరుకుంది.‘ఘోర ప్రమాదానికి సంబంధించి ఐవిఆర్‌ఎల్ నిర్మాణ సంస్థకు చెందిన ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేశాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నిర్మాణ కంపెనీపై ఐపిసిలోని సెక్షన్ 304,308, 407 కింద కేసు నమోదు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. ఫ్లైఓర్ కూలిపోయిన ఘటనలో మొత్తం 90 మంది గాయపడ్డారు. అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద ఎవరైనా సజీవంగా ఉండిఉంటారన్న ఆశతో బృందాలు సహాక కార్యక్రమా చేపట్టాయి. సైన్యం, కోల్‌కతా పోలీసులు, విపత్తుల నివారణ బృందం, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళం గురువారం రాత్రంతా సహాక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. శుక్రవారం మరో మూడు మృతదేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీసినట్టు పోలీసు కమిషనర్ చెప్పారు. రెండు ఆటోరిక్షాలు, పలు వాహనాలు కాంక్రీట్ స్టాబు కింద నుంచి బయటకు తీశారు. ఒక లారీ ఇంకా శిథిలాల కిందే ఉందన్న కమిషనర్ ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నంది లేనిదీ చెప్పలేమన్నారు.
ఫొరెన్సిక్ నిపుణులు ప్రమాద స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు. నిర్మాణంలో ఏదైనా లోపం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా కోల్‌కతా ఐవిఆర్‌ఎల్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించి, విచారణ జరిపారు. అలాగే నలుగురు సభ్యులుగల పోలీసు బృందం కోల్‌కతా నుంచి హైదరాబాద్ వెళ్లింది. అక్కడ అధికారులను ప్రశ్నించారు. మరోపక్క ఫ్లైఓవర్ నిర్మాణం విషయంలో ఎలాంటి లోపం లేదని, అది ప్రమాదావశాత్తూ చోటుచేసుకున్నదేనని ఐవిఆర్‌సిఎల్ లీగల్ టీమ్ చీఫ్ పి సీత స్పష్టం చేశారు. ప్రమాదం దురదృష్టవశాత్తూ జరిగిందన్న ఆమె దర్యాప్తు అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు.