జాతీయ వార్తలు

రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 13: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మంగళవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి చాంబర్‌లో ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు మళ్లీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన మదన్ లాల్ షైనీ మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడయిన మదన్ లాల్ షైనీ జూన్‌లో మృతి చెందడం వల్ల ఈ రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రజల కోసం తాను చేయగలిగినంత పని చేస్తానని మన్మోహన్ ప్రకటించారు. ‘ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు, కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని మన్మోహన్ సింగ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం మాట్లాడుతూ అన్నారు.
86 ఏళ్ల మన్మోహన్ సింగ్ వెంట గెహ్లాట్, పైలట్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జి అవినాశ్ పాండే, రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్, చీఫ్ విప్ మహేశ్ జోషి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తదితరులు ఉన్నారు.

చిత్రం...నామినేషనే పత్రాలు దాఖలు చేయడానికి వస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్