జాతీయ వార్తలు

ఇంకా ఐసీయూలోనే జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: అనారోగ్యంతో ఈనెల 9న ఇక్కడి ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత వైద్య వర్గాలు మంగళవారంనాడు ప్రకటించాయి. జైట్లీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన హృదయ స్పందనలు, రక్త సరఫరా మామూలుగానే ఉన్నాయని ఎయిమ్స్ అధికార వర్గాలు శుక్రవారంనాడు జైట్లీ ఆసుపత్రిలో చేరిన తర్వాత శుక్రవారంనాడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేసిన బులెటిన్ తర్వాత మళ్లీ ఇపుడు తాజాగా మరో బులిటెన్‌ను విడుదల చేశాయి. శనివారంనాడు ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు ఎయిమ్స్‌ను సందర్శించి జైట్లీ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న తర్వాత కేంద్ర మాజీ మంత్రి వైద్యానికి స్పందిస్తున్నారని ఉప రాష్టప్రతి కార్యాలయ వర్గాలు సైతం తెలిపాయి. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడిన అరుణ్ జైట్లీ శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే.