జాతీయ వార్తలు

డ్రగ్స్‌పై పంజాబ్ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 13: మాదకద్రవ్యాలను ప్రోత్సహించేలా పాటలుపాడే గాయనీ గాయకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకురానుంది. యువత బంగారు జీవితాలను నాశనం చేస్తున్న మాదకద్రవాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. మత్తుపదార్థాలను ప్రోత్సహించేలా చిత్రాలు తీసినా, అందులో నటించినా తీవ్ర పరిణామాలుంటాయని రాష్ట్ర మంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ హెచ్చరించారు. చెన్నా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ‘మాదకద్రవ్యాల వినియోగం, గన్ కల్చర్(తుపాకీ సంస్కృతి)ని ప్రొత్సహించడం చేయకూడదు. సమాజంలో మీరూ బాధ్యతగల పౌరులే’అని కళాకారులను ఉద్దేశించి మంత్రి స్పష్టం చేశారు. నటీనటులు యువతకు ఆదర్శవంతులుగా ఉండాలని ఆయన హితవుచెప్పారు. ‘పంజాబ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. సమాజానికి చీడగా మారిన మత్తుపదార్థాలను అరికటేందుకు త్వరలోనే చట్టం తీసుకొస్తున్నాం’అని ఆయన వెల్లడించారు. డ్రగ్‌ను ప్రోత్సహించే కళాకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఛన్నీ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి జానపద గాయకుడు పమీబాయ్ హాజరయ్యాడు. యువత భవిష్యత్‌ను బుగ్గిచేస్తున్న ఈ మహమ్మారికి వ్యతిరేకంగా సాగే ఉద్యమంలో తానూ పాల్గొంటానని అతడు ప్రకటించాడు. కొందరు పంజాబీ గాయకులు మాదకద్రవ్యాలను ప్రొత్సహించేలా పాటలు పాడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పమీబాయ్ అన్నారు. అలాంటి కళాకారులను సంఘ బహిష్కరణ చేయాలని అతడు డిమాండ్ చేశాడు. అలాగే మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నాడు. పాకిస్తాన్ సరిహద్దులో నిఘా పెంచాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సింగికేట్లను కట్టడి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా ప్రైవేటు, ప్రభుత్వం స్థలాలో, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలివిడిగా లౌడ్ స్పీకర్లు, ర్యాలీలు నిర్వహించడంపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎక్కడా మైక్‌లు, ర్యాలీలు నిర్వహించకూడదని గతనెలలో హైకోర్టు నిషేధం విధించింది. ఆ సందర్భంలోనే మాదకద్రవ్యాలను ప్రోత్సహించే సాహిత్యం, పాటలు, చిత్రాలను, ప్రత్యక్ష ప్రదర్శనలపై ఓ కనే్నసి ఉంచాలని రెండు రాష్ట్రాల పోలీసు డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. పంజాబీ గాయనీ గాయకులు, సినిమాలు విద్యార్థులు, యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నారని టూరిజం మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పాటల్లో ద్వంద్వ అర్థాలు, ‘మత్తు’ను ప్రోత్సహించే సాహిత్యాన్ని ప్రోత్సహించవద్దచని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ఇటీవల కళాకారులకు విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని ముఖ్యంగా యువతను కాపాడేందుకు గాయకులు, సినీ, నాటక కళాకారులు, దర్శక, నిర్మాతలు మందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. పంజాబ్‌లో మాదకద్రవాలు విచ్చలవిడిగా వినియోగంలో ఉన్నాయి. 2017లో అత్యధికంగా 505 కిలోల నల్లమందు దొరికింది. అదే ఏడాది 460 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. గుజరాత్‌లో అయితే ఏకంగా 1,017 కిలోల హెరాయిన్ 2017లో స్వాధీనం చేసుకున్నారు.