జాతీయ వార్తలు

రాజ్యాంగ విరుద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోన్‌బాద్రా (యూపీ) : జమ్మూ-కాశ్మీర్‌కు ఇంత కాలం ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. గత నెల ఉత్తరప్రదేశ్‌లోని ఉంబాలో ఓ స్థల వివాదం సందర్భంగా 10 మంది గిరిజనులు హత్యకు గురయ్యారు. హత్యకు గురైన గిరి పుత్రుల కుటుంబాలను మంగళవారం ప్రియాంక గాంధీ పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన పట్ల తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. గిరిజనుల భూముల విషయంలో కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రియాంక దుయ్యబట్టారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని విలేఖరులు ప్రస్తావించగా, ఆమె తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నదని ఆమె విమర్శించారు. తమ పార్టీ అన్ని వేళల్లోనూ రాజ్యాంగ పరిరక్షణకు గట్టిగా నిలబడిందని ఆమె చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, అందరి అభిప్రాయాలు తీసుకునే వాళ్ళమని ఆమె గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆమె విమర్శించారు. జమ్మూ-కాశ్మీర్‌కు రాజ్యాంగంలోని 370-అధికరణ ప్రకారం ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ఏకపక్షం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉంబాలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గత నెల ప్రియాంక గాంధీ బయలుదేరగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమెను మీర్జాపూర్ వద్ద అడ్డుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక పర్యటన కేవలం రాజకీయ స్టంట్ మాత్రమేనని ఉత్తర ప్రదేశ్‌రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ ఘాటుగా విమర్శించారు.
చిత్రాలు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌బాద్రాను సందర్శించి అక్కడి మహిళలతో ముచ్చటించారు. ఇటీవల జరిగిన భూ వివాదంలో ఈ ప్రాంతంలో పది మంది మరణించిన విషయం తెలిసిందే