జాతీయ వార్తలు

అభివృద్ధిలో ఆరోగ్య సాధనే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్ధా, ఆగస్టు 17: భారతదేశ అభివృద్ధిలో ఆరో గ్య సంరక్షణ అన్నది అత్యంత కీలకమైన అంశమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా ముందుకు సాగుతుందని రాష్ట్రపతి తెలిపారు. ఆరోగ్య సేవలు అందుబాటోలో లేకపోవడం, పౌష్టికాహార లోపం ఇతర వ్యాధులు తీవ్ర సమస్యగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహాత్మాగాంధీ వైద్య శాస్త్రాల సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా శనివారం నాడు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రపంచ జనాభాలో 18 శాతం భారత్‌లోనే ఉన్నారని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సవాల్ విసురుతున్న 20 శాతం వ్యాధులు కూడా ఇక్కడే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇవన్నీ కూడా ఓ పెద్ద సవాల్‌గానే పరిణమిస్తున్నాయని, సత్వర చర్యల ద్వారా వీటిని ఎదుర్కోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఇతర అనేక ఆరోగ్య మిషన్‌ల ద్వారా ప్రభుత్వాలు వైద్య సేవలను ప్రజల ముంగిళ్లలోకి తీసుకెళుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. అయితే భారతదేశ సమస్యలు సంక్లిష్టమైనవని, సామాజిక, ఆర్థిక సవాళ్లతో ఇవి ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ వైద్య శాస్త్రాల సంస్థ గత 50 ఏళ్లుగా దేశానికి నిరుపమాన సేవలందించిందని బోధనా పరంగానూ ఎంతో విశిష్టతను సంతరించుకుందని కోవింద్ తెలిపారు. మహాత్మాగాందీ బోధనలు జీవితమే ఆదర్శంగా తీసుకొని ఏర్పడ్డ ఈ సంస్థ అందుకు అనుగుణంగానే ప్రజాసేవ సాగిస్తూ వస్తోందన్నారు. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా అనేక మంది మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆయా కుటుంబాలకు సంతాపం తెలిపారు. అయితే వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడంతో పాటు వేలాది మందిని సురక్షితంగా రక్షించేందకు ఆయా ప్రభుత్వాలు చేసిన సేవలను కూడా కోవింద్ ఈ సందర్భంగా కొనియాడారు. ఇంతకు ముందు ఆయన సేవాగ్రం ఆశ్రమాన్ని సందర్శించారు. ఇదే ప్రాంతంలో మహాత్మాగాంధీ పది సంవత్సరాల పాటు నివసించిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు గోడలతో కూడిని ఈ సేవాగ్రం కుటీరం నుంచి నేర్చుకోవలసింది, స్ఫూర్తి పొందాల్సింది ఎంతో ఉందని కోవింద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రాంతంలో నేను నడుస్తున్నప్పుడు నా మనసంతా మహాత్ముడి సంఘర్షణలతోనూ, ఆయన త్యాగ నిరతితోనూ నిండిపోయింది’ అని ఆయన అన్నారు. సత్యవర్తన, అహింసలపై మహాత్మాగాంధీ చేసిన ప్రయోగాలన్నింటికీ సేవాగ్రాం నిలియంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ప్రభావితం చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కూడా ఈ ప్రాంతమే స్ఫూర్తి అని కోవింద్ పేర్కొన్నారు. సేవాగ్రాం, వార్ధా, విదర్భలకు ఎంతో ఘన చరిత్ర ఉందని వీటి ప్రాంగణాల్లోనే ఆచార్య వినోబాబావే భూదాన్ ఆందోళన మొలకెత్తిందన్నారు. అలాగే బాబా ఆమ్టే సామాజిక సంస్కరణ ఉద్యమానికి ఇవే స్ఫూర్తిగా మారాయని తెలిపారు.
చిత్రం...సేవాగ్రామ్‌లో బాపూ కుటీరాన్ని సందర్శించిన రాష్ట్రపతి కోవింద్, ఆయన భార్య సవితా