జాతీయ వార్తలు

జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోగ్యం శనివారంనాటికి మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్ సపోర్టుపై ఉంచినట్టు ఎయిమ్స్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. 66 ఏళ్ల జైట్లీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండడంతో మల్టీడిసిప్లినరీ టీమ్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శ్వాసపీల్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అరుణ్ జైట్లీ ఈ నెల 9 ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి నలుగురు సభ్యులు గల వైద్య బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది మేలో కూడా జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినపుడు అరుణ్ జైట్లీకి కీలకమైన ఆర్థిక, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కేంద్ర మంత్రులు శనివారం ఎయిమ్స్‌కు చేరుకుని వాకబు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, హర్షవర్ధన్, బీజేపీకి చెందిన సతీష్ ఉపాధ్యాయ, ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా, కాంగ్రెస్ నాయకులు అభిషేక్ సింఘ్వి, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కోలుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒక ట్వీట్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారంనాడు జైట్లీ కుటుంబ సభ్యులను కలుసుకుని వారిని ఓదార్చడంతోపాటు ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆక్షాంక్షించినట్టు పేర్కొన్నారు.