జాతీయ వార్తలు

నాడు నేతాజీ ఏమయ్యారు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా: నాడు బ్రిటీషు వారిని గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు? అని తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సరిగ్గా 74 ఏళ్ళ క్రితం నేతాజీ అదృశ్యం అయ్యారని ఆమె తెలిపారు.
1945 సంవత్సరం ఆగస్టు 18న నేతాజీ తైవాన్‌లోని తైహోకు విమానాశ్రయం నుంచి కనిపించకుండా పోయారని, ఇప్పటి వరకు జాడ లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏమి జరిగిందో ఇప్పటి వరకు అంతు చిక్కడం లేదన్నారు. భూమి పుత్రుడైన నేతాజీ కనిపించకుండా పోవడం బాధాకరమని అన్నారు. నేతాజీ అదృశ్యంపై రకరకలా ఊహాగానాలు వినిపిస్తున్నాయని ఆమె తెలిపారు. తైహోకు విమానాశ్రయంలో నేతాజీ విమానం ఎక్కారని, అయితే విమానం బయలుదేరిన కొంత సమయానికే కూలిపోయిందని, అందులో గొప్ప నాయకుడైన నేతాజీ మృత్యుఒడిలోకి జారిపోయి ఉంటారన్న ప్రచారం ఉందని ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. కానీ దీనిపై స్పష్టత లేదని, మరణించినట్లు ఎటువంటి ఆధారలూ లేవని ఆమె పేర్కొన్నారు. నిపుణులు కూడా రకరకాలుగా ఊహించారని ఆమె తెలిపారు. అయితే నేతాజీ ఆచూకి తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లోగడ పలు పర్యాయాలు కమిటీలను నియమించినట్లు ఆమె చెప్పారు. 1956 సంవత్సరంలో షా నవాజ్ కమిషన్‌ను, 1970లో ఖోస్లా కమిషన్‌ను, 2005 సంవత్సరంలో ముఖర్జీ కమిషన్‌ను నియమించినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ మిస్టరీ ఎందుకు వీడడం లేదని ఆమె ప్రశ్నించారు. నేతాజీ సజీవంగా ఉన్నా, లేదా మరణించినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నా తమకు తెలియజేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థన మేరకు జపాన్ ప్రభుత్వం 2016 సంవత్సరం సెప్టెంబర్ 1న ప్రత్యుత్తరం పంపిందన్నారు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్లుగానే జపాన్ ప్రభుత్వం తెలియజేసిందన్నారు. విమాన ప్రమాదం జరిగినప్పటికీ నేతాజీ బతికారని, ఇప్పటికీ సజీవంగా ఉన్నా, దాచి పెట్టారన్న అనుమానాలు ఉన్నాయని మమతా బెనర్జీ తెలిపారు.