జాతీయ వార్తలు

ముస్లిం మహిళలకు మేలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశ విభజనకు దారి తీసిన బుజ్జగింపు రాజకీయాలు ట్రిబుల్ తలాఖ్ వంటి దురాచారం ఇప్పటి వరకూ కొనసాగడానికి కారణమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఇక్కడ ‘ట్రిపుల్ తలాఖ్ రద్దు.. చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడం’ అన్న అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ట్రిబుల్ తలాఖ్‌ను నేరపూరిత చర్యగా ప్రభుత్వం ప్రకటించడాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ట్రిబుల్ తలాఖ్ నిషేధం వల్ల లింగపరమైన సమానత్వం సాధ్యమైందని పేర్కొన్న ఆయన అయితే కొందరు బీజేపీని ముస్లిం వ్యతిరేకమంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ముస్లిం మహిళలకు రక్షణ కల్పించాలన్న ఉద్ధేశ్యంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన ఉద్ఘాటించారు. ఈ దురాచారం వల్ల కోట్లాది మంది మహిళలు హక్కులు కోల్పోయి నరక యాతన అనుభవించారని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తిన అమిత్ షా ఇప్పటికీ ట్రిబుల్ తలాఖ్ చట్టాన్ని నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తూనే ఉందని వ్యాఖ్యానించారు. షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకుని వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత పార్లమెంటు చరిత్రలో అదో బ్లాక్-డేగా నిలిచి పోయిందన్నారు. ట్రిబుల్ తలాఖను వ్యతిరేకిస్తున్న లేదా సమర్థిస్తున్న వ్యక్తులకు ఇదో దురాచారం అన్న విషయం స్పష్టంగా తెలుసునన్నారు. ఎలాంటి దుష్ట సంప్రదాయాన్ని అయినా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలను బలపరచాల్సిన అవసరం ఉందని అమిత్ షా తెలిపారు. ట్రిబుల్ తలాఖ్ చట్టాన్ని ఇప్పిటికీ కొందరు వ్యతిరేకించడానికి కారణం బుజ్జగింపు రాజకీయాలేనని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలకు ఓటు బ్యాంకు రాజకీయాల ప్రాతిపదికగా అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారిందని, దీని కారణంగానే ఇలాంటి దురాచారాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశాభివృద్ధి, సామాజిక సమన్వయ సాధనలో బుజ్జగింపు రాజకీయాలు ప్రతిబంధకాలేనని అమిత్ షా తెలిపారు. సామాజిక సమన్నుతే లక్ష్యమైనప్పుడు అందు కోసం గట్టిగా కృషి చేయాలని, ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని అమిత్ షా తెలిపారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా రావడం అన్నది బుజ్జగింపు రాజకీయాల శకం అంతానికి నాంది పలికిందని, 2019లోనూ ప్రజలు ఆయనకు ఇచ్చిన తీర్పు దీనికి చరమగీతం పాడిందని అమిత్ షా పేర్కొన్నారు.

చిత్రం...న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా