జాతీయ వార్తలు

విమానం కుప్పకూలిన 51 ఏళ్ల తరువాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 19: ఢాకా హిమాలయ పర్వతశ్రేణుల్లో 1968లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-12 ట్రాన్స్‌పోర్టు విమాన శకలాల్ని ఎట్టకేలకు గుర్తించారు. 13రోజుల విస్తృత గాలింపు చర్యల అనంతరం ఆర్మీ ఈ శకలాలను గుర్తించింది. జూలై 26న డోగ్రా స్కౌట్ ఈ సాహస యాత్రకు నడుం బిగించించాలని నిర్ణయించింది. కులూ జిల్లాలోని రోహతంగ్ పాస్‌లోని మంచు కొండల్లో 1968 సంవత్సరం ఫిబ్రవరి ఏడో తేదీన కుప్పకూలిపోయింది. ఈ విమానంతో పాటు బోర్డులో ఉన్న సైనికులు ప్రయాణికుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. డోగ్రా స్కౌట్ విస్తృత గాలింపు అనంతరం 51 సంవత్సరాల తరువాత విమాన శకలాలను కనుగొనడం విశేషం. భూతలానికి ఐదువేల 240 మీటర్ల ఎత్తులో ఈ విమాన శకలాలను గుర్తించారు. గాలింపులో విమానానికి చెందిన ఏరో ఇంజన్, ఫ్యూజ్‌లేజ్, ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లు, ప్రొపెల్లర్, ప్యూయల్ ట్యాంక్ యూనిట్, ఎయిర్ మ్రేక్, కాక్‌పిట్ డోర్‌తో పాటు ప్రయాణికులకు చెందిన కొన్ని వస్తువులను కూడా కనుగొన్నట్లు అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఎలాగైనా మంచు కొండల్లో కూరుకుపోయిన ఏఎన్ 12 విమానాన్ని కనుగొనాలన్న సంకల్పంతో బృందం ఈనెల ఆరో తేదీన ఆపరేషన్ ప్రారంభించి 13 రోజుల్లో పూర్తి చేసింది.