జాతీయ వార్తలు

దేశం ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 19: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచే దేశం అభివృద్ధి చెందుతోందన్న వ్యాఖ్యలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం తీవ్రంగా ఖండించారు. ‘ఇది ఒక్కరోజులో వచ్చిన అభివృద్ధి కాదు.. మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత్ కోసం పునాది రాయి వేశారని.. అప్పటి నుంచి దేశం అభివృద్ధి సాధిస్తూ వచ్చిందన్న సంగతిని గుర్తుంచుకోవాలని’ గెహ్లాట్ అన్నారు. జైపూర్‌లో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో గెహ్లాట్ పాల్గొన్నారు. 1970, 1980 దశకంలో ఐటీ విప్లవానికి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్ గాంధీ విశేష కృషి చేశారన్న సంగతి దేశ ప్రజలకు తెలుసునని ఈ సందర్భంగా గెహ్లాట్ పేర్కొన్నారు. టెలిఫోన్ లైన్‌లు మొదలుకొని కలర్ టీవీల వరకు అప్పటి నుంచే అంకురార్పరణ జరిగిందని చెప్పారు. దేశం సాంకేతికంగా దినదినాభివృద్ధి చెందుతోందని.. సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజలను సాంకేతిక విప్లవం సునాయాసంగా కలిపిందని అన్నారు. ‘ఈరోజు మీరు కేవలం సెల్‌ఫోన్ ద్వారా ట్రైన్, బస్సు, విమాన టికెట్లను బుక్ చేసుకొనే అవకాశం వచ్చింది’ అని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు సునాయాసంగా అతికొద్ది సమయంలో మాట్లాడుకోగలుగుతున్నారని చెప్పారు. ఇదంతా కేవలం ఒక్క రోజులో జరిగిన అభివృద్ధి కాదు అని గెహ్లాట్ నొక్కి చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను ప్రస్తుత యువతరం స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని పిలుపునిచ్చారు.

చిత్రం... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా సోమవారం జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్