జాతీయ వార్తలు

ఢిల్లీని భయపెడుతున్న యమున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్, హిమచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీకి తాగునీరు అందించే హత్నికుండ్ బ్యారేజికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం కూడా భారీఎత్తున నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో సోమవారం యమునా నదికి వరద తీవ్రత ఎక్కువైంది. యమునా నది ప్రమాదకర స్థాయి 204 మీటర్ల కాగా డేంజర్ లెవల్ మార్కు 204.50 మీటర్ల మార్కును దాటేసింది. యమునా నది వరద కారణంగా ఢిల్లీకి వరద ముంపు పొంచివుంది. దీంతో యమునా నదీ పరీవాహకం ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఢిల్లీలో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమీక్షించారు. వరద మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. యమునా నదీ పరీవాహకంలో 23,816 మందికి గానూ 2120 క్యాంపులను ఢిల్లీ అధికారులు ఏర్పాటు చేశారు.
యమునా నది ప్రమాదస్థాయిన మించి ప్రవహించడంతో అత్యంత పురాతన బ్రిటిష్ హయాంలో నిర్మించిన రోడ్డు-రైల్వే వంతెనపై రాకపోకలను సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. నదీ ప్రవాహం మరింత పెరుగుతుందనే అంచనాతో పురాతన ఇనుప వంతెనను మూసి వేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.

చిత్రం...ఎగువన ఉన్న హత్‌నికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో ప్రమాద స్థాయిలో యమునా నది