జాతీయ వార్తలు

ప్రాంతీయ శాంతికి పాక్ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దాదాపు అరగంట పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్ చర్చలు జరిపారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడం, భద్రతా మండలిలో చైనా, పాకిస్తాన్‌లకు చుక్కెదురైన నేపథ్యంలో మోదీ-ట్రంప్ చర్చలకు విశేష ప్రాధాన్యత చేకూరింది. దక్షిణాసియా ప్రాంతంలోని కొందరు నాయకులు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడ్డం, హింసను ప్రేరేపించడం వల్ల శాంతియుత పరిస్థితులకు తీవ్ర స్థాయిలో విఘాతం కలుగుతుందని ట్రంప్‌కు మోదీ విస్పష్టంగా తెలియజేశారు. కాశ్మీర్ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ విషం కక్కుతున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అరగంట చర్చల్లో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య ఉన్న సామరస్య పూర్వక, సుహృద్భావ సంబంధాలకు ఈ అరగంట చర్చలు తార్కాణంగా నిలిచాయని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జూన్ చివర్లో జపాన్‌లో ఒసాకాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తమ మధ్య జరిగిన సమావేశాన్ని కూడా ఈ సందర్భంగా ట్రంప్‌కు మోదీ గుర్తుచేశారు. పరస్పరం లబ్దిపొందేలా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి ఇరుదేశాల మంత్రుల మధ్య త్వరలో చర్చలు జరగగలవన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. ప్రాంతీయ పరిస్థితిని (దక్షిణాసియా) ప్రస్తావించిన మోదీ పాకిస్తాన్ ప్రతికూల ధోరణిని ఎండగట్టారు. దీనివల్ల శాంతియుత పరిస్థితులకు
మరింతగా విఘాతం కలిగే ప్రమాదం ఉందని ట్రంప్ తెలిపారు. ఎలాంటి మినహాయింపు లేకుండా సీమాంతర ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని, అదే విధంగా హింసా ఉగ్రవాదానికి ఆస్కారం లేని బలమైన శాంతియుత పరిస్థితులను పాదుగొలపాల్సిన అవసరం గురించి కూడా మోదీ ఈ సందర్భంగా ట్రంప్‌కు తెలియజేశారు. పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధుల నిర్మూలన దిశగా ఎవరు ప్రయత్నించినా, ఉగ్రవాదాన్ని రూపుమాపే చర్యలను ఎవరు చేపట్టినా వారికి భారత్ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేసినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూనే ఉన్నారు. మోదీని ఫాసిస్టుగా, రేసిస్టుగా కూడా ఆయన విమర్శించారు. అలాగే భారతదేశాన్ని హిందూజాత్యాంహకార దేశంగా మార్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, భారత్‌లోని ముస్లింలకు హక్కులు లేకుండా పోతున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు పేట్రేగిపోతున్నారని కూడా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పరోక్షంగా పాకిస్తాన్ ధోరణిని ఎండగడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోదీ వాస్తవాలు తెలియజేయడం కూడా ప్రాధాన్యతతో కూడిన అంశమే.