జాతీయ వార్తలు

రాజ్ థాక్రేకు ఈడీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 19: హవాలా కేసుకు సంబంధించి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రేకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. దీనిపై పార్టీలో తీవ్ర ప్రతిస్పందన కనిపించింది. రాజకీయ కక్షతోనే ఈ చర్యకు పాల్పడినట్లు సేన నాయకులు, కార్యకర్తలు మండపడ్డారు. ఎన్నికల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానే తిరిగి పాత పద్ధతిలో అంటే బ్యాలెట్ పత్రాలనే వాడాలని రాజ్ థాక్రే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితర ప్రతిపక్షాలతో ఇటీవల థాక్రే చర్చించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రభుత్వం కక్ష పూరితంగా ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్‌తో నోటీసులు ఇప్పించిందని సేన నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్ష్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) కుంభకోణానికి సంబంధించి రాజ్ థాక్రేతో పాటు శివ సేన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కుమారుడు ఉనే్మశ్ జోషికీ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.