జాతీయ వార్తలు

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఖయ్యాం కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 19: కభీ కభీ, ఉమ్రావ్‌జాన్ సహా వందలాది హిందీ చిత్రాల్లో తన అద్భుత స్వర రచనతో అజరామరగీతాలు అందించిన అలనాటి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఖయ్యాం సోమవారం రాత్రి మరణించారు. 92 సంవత్సరాల ఖయ్యాం దీర్ఘకాలంగా ఇక్కడ సుజాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 10 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఖయ్యాం గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను ఈ ఆసుపత్రిలో చేర్పించామని కుటుంబ సన్నిహితుడు ఒకరు తెలిపారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలను ఆయన అందుకున్నారు. ఖయ్యాం భౌతికకాయానికి అంతిమ సంస్కారం మంగళవారం జరుగుతుంది. హిందీ చలన చిత్ర రంగంలో తనదైన శైలిలో ఎన్నో అద్భుత గీతాలను అందించిన ఘనత ఖయ్యాంకు దక్కుతుంది. కాలం మారినా మాధుర్యం తగ్గని పాటలతో ఆయన మనకు అందించారు. త్రిశూల్, నూరీ, షోలా ఔర్ షబ్నం, ఫరఖ్ వంటి చిత్రాల్లోని పాటలు ఖయ్యాంకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టాయి.