జాతీయ వార్తలు

తగ్గని వరద బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : హిమాలయ ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లను ఎడతెరపిలేని వర్షాలు గత మూడు రోజులుగా ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 35 మంది మరణించినట్టుగా అధికారులు నిర్ధారించారు. అలాగే పంజాబ్, హర్యానా, జమ్మూ-కాశ్మీర్‌లను వరదలు ముంచెత్తే అవకాశం కనిపిస్తోందని, అలాగే ఢిల్లీలో యమునానది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో తాజాగా మరో ముగ్గురు మరణించారు. గత నాలుగు రోజులుగా వరదలు, కొండ చరియలు విరిగిపడడం వంటి సంఘటనల కారణంగా రాష్ట్రంలోని అనేక చోట్ల ప్రజలు చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. అనేక ఇల్లు ధ్వంసం కావడంతో పాటు నీటి సరఫరా లైన్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంగళవారం వరకు హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణం విభాగం అధికారులు తెలిపారు. మెరుపు వరదలు, కొండ చరియలు విరిగిపడిన కారణంగా అనేక చోట్ల రహదారులు మూసుకుపోయాయని ఆయా ప్రాంతాల ప్రజలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రకృతి బీభత్సం వల్ల 574 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే తీవ్ర వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా భారీగా నష్టపోయిందని, ఇక్కడ మరో మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. మరో 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. వర్షాలు, వరదలు వల్ల పెద్ద సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయని, వ్యవసాయ పంటలు నాశనం అయ్యాయని తెలిపారు. ఈ జిల్లాలోని 12 గ్రామాల్లో నష్ట తీవ్రత చాలా ఎక్కువగానే ఉందని తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్ల నిలిచిపోయిన సహాయక చర్యలను సోమవారం చేపట్టారు. సహాయ చర్యల్లో హెలికాప్టర్‌లు, వైమానిక దళ విమానాలు చురుగ్గా పాల్గొని బాధిత ప్రజలకు నిత్యావసరాలను చేరవేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను మెరుగుపరచేందుకు వీలుగా అనేక ప్రాంతాల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. కాగా, ఢిల్లీలోని యమునా నది ప్రమాద స్థాయిని దాటి ఉప్పొంగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దిగువ ప్రాంతాల్లో వున్న ప్రజలు తాత్కాలిక శిబిరాలకు తరలిరావాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. పాత యమునా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సోమవారం అత్యవసరంగా అధికారులతో సమావేశమైన కేజ్రీవాల్ పరిస్థితిని సమీక్షించడంతో పాటు, అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. ప్రజలు ఆందోళనకు గురికావలిసిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయ న లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం ఎలాంటి జాప్యం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలన్నారు. పంజాబ్, హార్యానాలోని కొన్ని ప్రాంతా ల్లో సోమవారం వరద తీవ్రత కొనసాగింది. బాధిత ప్రజలను ఆదుకోవడంలో సహాయ బృందా లు చురుగ్గా పాల్గొంటున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ వరద ముంపునకు గురైన ప్రాం తాల్లో పర్యటించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. త్వరితగతిన సాధారణ పరిస్థితులను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. జమ్మూలో నలుగురు జాలర్లను హెలికాప్టర్‌ల ద్వారా రక్షించాయి.

చిత్రాలు.. దెబ్బతిన్న చండీగఢ్ - మనాలి హైవే
*జమ్మూలోని తావి నదిలో చిక్కుకుపోయిన ఇద్దరు జాలర్లను రక్షిస్తున్న భారత వైమానిక దళం
* ఉత్తరకాశీ వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు