జాతీయ వార్తలు

ఖయ్యాంకు తుది వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఖయ్యాంకు ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం ఇక్కడ అంత్యక్రియలు జరిగాయి. 92 సంవత్సరాల ఖయ్యాం మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం జుహూలోని ఆయన ఇంటివద్దే కొన్ని గంటలపాటు ఉంచారు. ఖయ్యాంకు గౌరవ సూచకంగా పోలీసులు గన్ శాల్యూట్ చేశారు. ప్రఖ్యాత రచయితలు గుల్జార్, జావెద్ అక్తర్, నిర్మాత విశాల్ భరద్వాజ్, గాయనీ గాయకులు సోనీ నిగమ్, ఉదిత్ నారాయణ్, అల్కాయాగ్నీ, సంగీత దర్శకుల ద్వయం జెటిన్-లిలిత్, నటి పూనం థిల్లాన్ తదితరులు ఖయ్యాంకు తుది వీడ్కోలు పలికారు. ఖయ్యాం మరణంతో ఓ సువర్ణ శకానికి సంబంధించిన బలమైన తొలగిపోయిందని జావెద్ అక్తర్ అన్నారు. తక్కువ సినిమాలకే ఆయన సంగీత దర్శకత్వం వహించినా నాలుగైదు దశాబ్దాలపాటు ఆయన పాటలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయని అక్తర్ తెలిపారు. నేటి సినిమాలు ఎంతగా ప్రజాదరణ పొందినా 15 రోజులకే వాటిలో పాటలు మరిచిపోతున్నారని, అలాంటిది 50 ఏళ్ల క్రితం ఖయ్యాం స్వరపరచిన పాటలు ఇప్పటికీ ప్రజలను అలరిస్తున్నాయని ఆయన అన్నారు. ఆయన స్వరపరచిన ప్రతి పాట అద్భుతమేనని, స్వరం, సంగీతం, సాహిత్యం ఈ మూడు కూడా ఎక్కడా స్పష్టతను కోల్పోకుండా ఆయన పాటలను సృష్టించారని అక్తర్ తెలిపారు. ఇపుడు ఈ మూడింటికి కూడా ఏ పాటలోనూ విలువలేకుండా పోయిందని ఆయన అన్నారు. తన తొలి చిత్రం త్రిశూల్, రెండో చిత్రం నూరికి ఖయ్యాం అందించిన పాటల వల్లే నటిగా తాను నిలదొక్కుకున్నానని నటి పూనం థిల్లాన్ ఈ సందర్భంగా తెలిపారు.

చిత్రం... ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఖయ్యాంకు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతున్న దృశ్యం