జాతీయ వార్తలు

అందరికీ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2020 సంవత్సరం నాటికి అందరికీ ఇండ్లు కట్టించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గృహా నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. గడువుకు రెండేళ్ళ ముందే దీనిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. మంగళవారం జరిగిన ‘నారేడ్కో’ 15వ జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రి పూరీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పూరీ కొంత సేపు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 24 లక్షల ఇండ్లు నిర్మించి అర్హులైన వారికి ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో 50 లక్షల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 48 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాన్ని 75 లక్షలకు పెంచనున్నట్లు చెప్పారు. 2022 సంవత్సరాంతానికి కోటి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇదివరకే నిర్ణయించామన్నారు. ఈ మేరకు 84 లక్షల ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా కోటి ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజల డిమాండ్‌ను చూస్తే ఇంకా 12 లక్షల ఇండ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుందన్న అంచనా వేశామని చెప్పారు. 2022 నాటికి అందరికీ ఇండ్లు ఇవ్వాలన్నది తమ లక్ష్యం కాగా అంతకు ముందే అంటే 2020 నాటికే అందించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి పూరీ తెలిపారు.