జాతీయ వార్తలు

పోలవరం టెండరింగ్‌లో నిర్ణయం తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి షెకావత్‌తో సుజనా చౌదరి గురువారం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రజల్లో గందరగోళం నెలకొన్నదని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మేరకు సుజనా చౌదరి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం రివర్స్ టెంటరింగ్‌ను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టు త్వరితగిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా గ్రహిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యక్తిగత అహంభావాలకు, పంతాలకు పోకుండా పోలవరం సాఫీగా పూర్తయ్యేందుకు అందరూ సహకారించాలని సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు.