జాతీయ వార్తలు

అధికారుల తీరు సిగ్గుచేటు డీఎంకే చీఫ్ స్టాలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 22: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను అరెస్టు చేసిన తీరుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీబీఐ కక్ష సాధింపుపరాకాష్టకు చేరిందనడానికి ఇది నిదర్శమని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి ఇల్లు ప్రహరీగోడ దూకి మరీ అరెస్టు చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని స్టాలిన్ నిలదీశారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని ఆయన అన్నారు. ‘ఢిల్లీలోని చిదంబరం ఇంటి ప్రహరీ గోడ ఎక్కడం టీవీల్లో చూశాను. ఇది సిగ్గుచేటు. సీబీఐ అధికారులు తీరును ఖండిస్తున్నా. ఇది దేశానికి జరిగిన అవమానం’అని డీఎంకే చీఫ్ వ్యాఖ్యానించారు. జోర్‌బాగ్‌లోని చిదంబరం ఇంటి ప్రహరీ గోడ ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. తొలుత ముగ్గురు అధికారులు గోడ ఎక్కి లోపలికి వెళ్లారు. తరువాత మిగతా టీమ్ సభ్యులు రావడానికి వీలుగా మెయిన్ గేట్లు తెరిచారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో దర్యాప్తునకు చిదంబరం సహకరిస్తున్నారని అన్నారు. చిదంబరం న్యాయపుణుడని కేసును న్యాయపరంగానే ఎదుర్కొనగలరని ఆయన పేర్కొన్నారు.
ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించిన తరువాత అరెస్టు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు.