జాతీయ వార్తలు

సీబీఐ భవనానికి వాస్తుదోషం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చిదంబరం ఉదంతాన్ని గుర్తుచేస్తూ అధికారులు కొందరు ఆసక్తికరమైన అంశాలు చెబుతున్నారు. సీబీఐ భవన నిర్మాణంలోనే వాస్తుదోషం ఉందని వారు తేల్చారు. శ్మశానం స్థలంలో భవనాన్ని నిర్మించారని తెలిపారు. భవన ప్రారంభోత్సంలో పాల్గొన్న ఉన్నతాధికారులు వివాదాల్లో చిక్కుకున్నారని వారు గుర్తుచేస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్, ఆయన తరువాత వచ్చిన రంజిత్ సిన్హాపై వారు పనిచేస్తున్న సంస్థే కేసు నమోదు చేయడం గమనార్హం. మరొక ఉన్నతాధికారి అనిల్ సిన్హా తీవ్రమైన విమర్శలే ఎదుర్కొన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా లండన్ పారిపోవడం వెనక అనిల్ సిన్హా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. తరువాత అలోక్ వర్మ ఉదంతం తెలియంది కాదు. ఆయన డిప్యూటీతో తలెత్తిన వివాదం చివరికి పదవికే ఎసరు తెచ్చింది.