జాతీయ వార్తలు

రెండు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, ఆగస్టు 22: పనె్నండేళ్ల లోపు బాలికలపై జరిగే అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలపై విచారణను రెండు నెలల్లోనే పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. పశ్చిమ జోనల్ మండలి 24వ సమావేశాన్ని ఉద్దేశించి గురువారం నాడిక్కడ మాట్లాడిన అమిత్‌షా ఇలాంటి కేసుల దర్యాప్తు, విచారణ అన్నది నేరాలు జరిగిన రెండు నెలల్లోనే పూర్తయ్యేలా తగిన యంత్రాంగాన్ని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లు హాజరయ్యారు. ఇలాంటి కేసులను ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, చట్టప్రకారం దర్యాప్తు, విచారణ జరపాలని షా తెలిపారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి బ్యాంకు, పోస్టల్ లేని గ్రామాల విషయం ఇందులో ప్రస్తావనకు వచ్చింది. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలను బదిలీ చేసే వ్యవహారాన్ని ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు ద్వారా కూడా చేయాలని అమిత్‌షా తెలిపారు. కేవలం గణాంకాల విన్యాసం కంటే కూడా వ్యవస్థాగతంగా కూడా సంస్కరణలను అమలు చేయడం ఎంతో అవసరమని ఆయన అన్నారు.
పశ్చిమ రాష్ట్రాల్లో వేగవంతంగా అభివృద్ధి సాగేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఆయా రాష్ట్రాలు ఈ సమావేశంలో సంకల్పించారు. ఈ రాష్ట్రాలను ఐదు జోన్‌లుగా విభజించి ఓ మండలిని కూడా ఏర్పాటుచేశారు. ఆ మండలిలో ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ జోనల్ కౌన్సిళ్లకు కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహిస్తారు.
చిత్రం... గోవా రాజధాని పనాజీలో గురువారం జరిగిన పశ్చిమ జోనల్ మండలి 24 సమావేశానికి అధ్యక్షత వహించిన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.