జాతీయ వార్తలు

కేంద్ర కేబినెట్ సెక్రటరీగా రాజీవ్ గౌబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్‌కుమార్ భల్లాను కేంద్రం ప్రభుత్వం నియమించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల్లో కీలక నియామకాలు చేపట్టింది. ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది. దేశంలోనే అత్యున్నత అధికార హోదా అయిన క్యాబినెట్ సెక్రటరీగా కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజీవ్ గౌబాను నియమించారు. అలాగే కొత్త హోం శాఖ కార్యదర్శిగా అజయ్ కుమార్ భల్లాను నియమించారు. అస్సాం, మేఘాలయ క్యాడర్ 1984 బ్యాచ్‌కు చెందిన భల్లా ప్రసుత్తం కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. హోం శాఖ కార్యదర్శిగా ఉన్న రాజీవ్ గౌబా స్థానంలో భల్లా ఇకనుంచి పని చేస్తారు. ప్రస్తుతం ఆర్ధిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్రగార్గ్ ఇకనుంచి కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి చక్రవర్తి ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అన్షు ప్రకాష్ ఇకనుంచి కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలోని టెలి కమ్యూనికేషన్ విభాగంలో కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్‌ఎస్ శుక్లాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, అలాగే జీవీ వేణుగోపాల జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో సభ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. దేశంలో అత్యున్నత అధికారి హోదా అయిన క్యాబినేట్ సెక్రటరీగా రాజీవ్ గౌబా నియమితులయ్యారు. జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన 1982 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన గౌబా క్యాబినెట్ సెక్రటరీగా పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు.