జాతీయ వార్తలు

పీడకలగా ఐఎన్‌ఎక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఒకప్పుడు బంధనాలు లేని ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేస్తూ కలల బడ్జెట్‌ను అందించిన పళనియప్పన్ చిదంబరం ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత సంక్లిష్టమైన పరీక్షనే ఎదుర్కొంటున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా పెట్టుబడుల కేసు ఇప్పుడు ఆయన్ని పీడకలగా వెన్నాడుతోంది. ఈ కేసులో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి చిదంబరాన్ని ఈబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఆరోపణల నుంచి బయటపడి తన నిజాయతీని రుజువు చేసుకోవాలంటే 73 ఏళ్ల చిదంబరానికి సుదీర్ఘ న్యాయపోరాటం అనివార్యంగానే కనిపిస్తోంది. దేశ ఆర్థిక మంత్రిగానే కాకుండా, హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన చిదంబరం మొదటినుంచీ కూడా వ్యాపార స్వేచ్ఛకు, ఆర్థిక సంస్కరణలకు వత్తాసు పలుకుతూ వస్తున్నారు. 60వ దశకం ద్వితీయార్థంలో వామపక్ష భావాలతో తన ఆర్థిక ఆలోచనలను వెలుగులోకి తెచ్చిన చిదంబరం నేపథ్యం కూడా ఓ ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చినదే. హార్వార్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన చిదంబరం తమ కుటుంబ వ్యాపారం జోలికి పోకుండా రాజకీయ బాట పట్టారు. 1967లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినా ఆయన ఇందిరాగాంధీ విధేయుడుగానే కొనసాగారు. 1984లో అప్పటి రాజీగాంధీ ప్రభుత్వంలో జూనియర్ వాణిజ్య మంత్రిగా చేరారు. అలాగే పీవీ నరసింహారావు ప్రభుత్వంలోనూ ఇదే హోదాలో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన వాణిజ్య పరిశ్రమల శాఖ సమర్థంగా నిర్వహించారు. అయితే రాజకీయ పొత్తులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలతో విబేధించిన ఆయన 1996లో కొత్తగా రాజకీయ పార్టీని పెట్టుకున్నారు. ఏడాది తిరక్కుండానే 13 పార్టీల కూటమిగా ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ఫ్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. అప్పట్లోనే ఆయన ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేస్తూ డ్రీమ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాని కారణంగానే పన్నుల వసూళ్ల విస్తృతి పెరిగింది. అప్పట్లో ఆర్థిక సంస్కరణలనేవి పేదలకు వ్యతిరేకమన్న భావన బలంగా ఉన్నప్పటికీ కూడా చిదంబరం తన ఆలోచనలతోనే ముందుకు వెళ్లారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన చిదంబరం అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004-2008 మధ్య ఆర్థిక మంత్రిగా కొనసాగిన ఆయన అప్పటి నుంచి 2012వరకు హోం మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ 2014 వరకు ఆర్థిక మంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక వృద్ధి వేగాన్ని పెంచేందుకు సంస్కరణలకు వేగంగా అమలు చేసిన ఘనత చిదంబరానిదే. అలాగే ఆర్థిక లోటును తగ్గించడంతో పాటు దేశంలోకి విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడంలోనూ ఆర్థిక మంత్రిగా ఆయన క్రియాశీలక భూమిక పోషించారు. 2014లో తమిళనాడులో శివగంగ స్థానం నుంచి ఆయన పోటీ చేయలేదు. ఇదే నియోజక వర్గం నుంచి ఆయన ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐఎన్‌ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిక్, అలాగే విమానాల కొనుగోలుపై వచ్చిన అనేక అవినీతి ఆరోపణలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఈ వ్యవహారాల్లో చిదంబరానే్న టార్గెట్ చేసింది. యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా చిదంబరం తీసుకున్న అన్ని నిర్ణయాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరెట్‌లు దర్యాప్తును మొదలుపెట్టాయి, అంతిమంగా అవి చిదంబరం అరెస్ట్‌కు దారితీయడం ఓ సుదీర్ఘ రాజకీయ కెరీర్‌లో విస్మయకరమైన మలుపే!