జాతీయ వార్తలు

మానవాళికి తరగని స్ఫూర్తి గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: మానవాళి ఉన్నంతవరకూ మహాత్ముడు ప్రవచించిన విలువలు, సిద్ధాంతాలకు తిరుగే ఉండదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. మహాత్మాగాంధీ ఆచరించిన విలువలు, ఆలోచనలు ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ అనుసరించి, ఆచరించదగినవని, అదేవిధంగా ఇతరుల పట్ల కనబరిచే గౌరవం కూడా మరింత పెంపొందించాల్సిన అవసరాన్ని కూడా అందరికీ చాటిచెప్పాలని గాంధీ నొక్కిచెప్పారని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దయాగుణంపై యునెస్కో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐఈపీ) ఆధ్వర్యంలో శుక్రవారంనాడు జరిగిన వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్‌లో రాష్టప్రతి మాట్లాడారు. ‘గాంధీ బోధించిన శాంతి, సహనం, సౌభ్రాతృత్వం కోసం వంటి లక్షణాలను ప్రస్తుత సమాజంలో ఎంతో ఆచరించిదగినని, ఇది మానవాళి జీవన మనుగడకు ఎంతో దోహదపడతాయి. అదేవిధంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడడం వంటి ముఖ్యాంశాలపై కూడా దృష్టి సారించాలి’ అని ఆయన ఉద్బోధించారు. ‘ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి, వాటిలో కలహాలు, హింస తదితర అంశాలు వణికిస్తున్నాయి’ అని రాష్టప్రతి పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో గాంధీ చూపిన అహింసాయుత మార్గాన్ని ప్రతిఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అన్నారు. మనముందున్న పలు సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు మన పిల్లల్లో కూడా గాంధీ ఆచరించిన, బోధించిన పలు సుగుణాలను అవలంబించడం, ఆచరించేందుకు ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని 27 దేశాల నుంచి దాదాపు వెయ్యిమంది యువకులు హాజరయ్యారు. మరికొన్ని వారాల్లో అక్టోబర్ 2న మహాత్ముడి 150వ జయంతిని జరుపుకుంటున్నామని, ఆయన విలువలు, సిద్ధాంతాలు నేటికీ ఎంతో ఆచరణీయమని కోవింద్ అన్నారు. భారతదేశంలో పుట్టినప్పటికీ మహాత్మాగాంధీ యావత్ ప్రపంచానికే, మానవాళి అంతటికీ చెందిన వ్యక్తి అని స్పష్టం చేశారు. మానవీయ విలువల కోసం ఆయన పాటుపడ్డారని, ప్రతిఒక్కరి గౌరవ మర్యాదలను పెంపొందించేదిగానే మానవ ప్రయత్నాలు ఉండాలన్న సిద్ధాంతా న్ని ప్రబోధించారని కోవింద్ అన్నారు.
గాంధీలో సృజనాత్మకత, తనపై తాను ప్రయోగాలు చేసుకునే ధీరత్వం, అన్నింటికీ మించి తన సిద్ధాంతాలను అకుంఠితరీతిలో ముందుకు తీసుకువెళ్లగలిగే అంకితభావం ఆయనలో ఉన్నాయని కోవింద్ అన్నారు.