జాతీయ వార్తలు

మోదికీ మీరేమైనా సలహా ఇచ్చారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షాల నేతలను దోషులుగా నిలబెట్టవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులు ఎవరైనా బహిరంగంగా సలహా ఇచ్చారా? అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలను దోషులుగా చూపించడం సమంజసం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ చెప్పడాన్ని ఆ పార్టీ నాయకులు అభిషేక్ సింఘ్వి, శశిథరూర్ సమర్థించారు. ఇలాఉండగా శనివారం కపిల్ సిబల్ మరో అడుగు ముందుకేసి మోదీ చర్యలను బీజేపీ నాయకులు ఎవరైనా గట్టిగా నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారా?, బహిరంగంగా సలహా ఇచ్చారా? అని సిబల్ శనివారం ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇలాఉండగా ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన ట్వీట్‌ను కేరళ మీడియా అత్యుత్సాహంగా వక్రీకరించిందని శశిథరూర్ శనివారం స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవశ్యకత ఉందని శశిథరూర్ పేర్కొన్నారు. 2019లో బీజేపీని గెలిపించిన ఓటర్లు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని శశి ట్వీట్‌లో కోరారు.