జాతీయ వార్తలు

అభినవ చాణక్యుడు.. మోదీకి వజ్రతుల్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: నాలుగు దశాబ్దాల అరుణ్‌జైట్లీ రాజకీయ జీవితం ఓ అద్భుతమే. అధికారంలో ఉన్నవారికి తలలో నాలుకలా వ్యవహరించడంలోనూ వ్యూహరచనా సామర్థ్యంతో ఎలాంటి జటిల సమస్యనైనా చిటికెలో అధిగమించడంలోనూ జైట్లీ సామర్థ్యం అనితర సాధ్యమే. అందరినీ ఆకట్టుకునే మాట తీరు, వాక్పటిమ, న్యాయశాస్త్రం పట్ల అపారమైన అవగాహన, అన్నింటినీ మించి సంక్లిష్ట సమస్యలను సైతం తుత్తునియలు చేసే చాతుర్యం బీజేపీకి అన్నివిధాలుగా కలిసొచ్చింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి అరుణ్ జైట్లీ ‘ట్రబుల్ షూటర్’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అనారోగ్యం కారణంగా 66 సంవత్సరాలకే కన్నుమూసిన జైట్లీ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు నిర్వహించి రాణించి ప్రజలను మెప్పించి వాటికి వనె్న తెచ్చారు. నరేంద్ర మోదీకి లభించిన అభినవ చాణక్యుడుగా పేరొందిన జైట్లీ అభిప్రాయ సేకరణలో దిట్ట. భిన్న సిద్ధాంతాలు, ఆలోచనలు కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తెచ్చి భావసారూప్యతను సాధించడంలోనూ ఆయనది అందె వేసిన చెయ్యి. ముఖ్యంగా నరేంద్ర మోదీకి 2002 నుంచి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి అరుణ్ జైట్లీ. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ ఆయన ఆలవోకగా పరిష్కరించి గట్టెక్కగలిగారంటే జైట్లీ బలమైన అండ వుండటమే. న్యాయశాస్త్రం పట్ల జైట్లీకున్న పట్టే మోదీని ఆ సమస్యలనుంచి గట్టెక్కించింది. ఒక్క మోదీకే కాదు, ఆ సమయంలో అమిత్ షాను కూడా సమస్యల సుడిగుండం నుంచి జైట్లీ తప్పించగలిగారు.
ముఖ్యంగా గుజరాత్ నుంచి అమిత్ షా బయటకు వెళ్లిపోవాల్సిన సమయంలో ఆదుకున్నది అరుణ్ జైట్లీనే. ఆ రోజుల్లో జైట్లీ కైలాష్ కాలనీ ఇంట్లోనే అమిత్ షా తరచూ కనిపించేవారు. వారానికి రెండుమూడు సార్లయినా వీరిద్దరి మధ్య సమావేశం జరిగేది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడానికి కొన్ని నెలల ముందు జైట్లీ తెర వెనుక పావులు కదిపారు. రాజ్‌నాథ్‌సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. న్యాయవాదిగా సుశిక్షితుడైన జైట్లీ వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అరుణ్‌జైట్లీ తనకు వజ్రతుల్యుడని నరేంద్ర మోదీనే స్వయంగా అభివర్ణించారు. అధికారంలో ఉన్నవారితో ఏవిధంగా మెసలాలి అన్న నైపుణ్యం తెలుసుకున్న అరుణ్ జైట్లీ 1990 ద్వితీయార్థంనుంచి మోదీకి సన్నిహితుడుగా మెలిగారు. 2002 అల్లర్ల అనంతరం ఎన్నో కోర్టు సమస్యలనుంచి ఆయన్ను బయటకు తీసుకురాగలిగారు. భిన్న రంగాల్లో సాధించిన అపారమైన అనుభవం, అన్నింటికీ మించి సామర్థ్యం అరుణ్‌జైట్లీ, నరేంద్ర మోదీ మధ్య మరింత బంధానే్న వేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను జైట్లీకి అప్పగించారు. ఆ హయాంలోనే రక్షణ శాఖనూ, సమాచార శాఖనూ ఆయన నిర్వహించారు. మోదీ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టడంలోనూ, వివాదాస్పద విధానాలను సమర్ధించుకోవడంలోనూ, విపక్ష కాంగ్రెస్‌పై చెలరేగిపోవడంలోనూ, 2019 ఎన్నికల్లో బీజేపీ వ్యూహరచన చేయడంలోనూ జైట్లీ వెన్నుదన్నుగా నిలిచారు. ఖరీదైన పెన్నులు, కార్లు, వాచ్‌లను సేకరించే ఆసక్తి జైట్లీకి మెండుగా ఉండేది.
మోదీ మొదటి హయాంలోనే ఆయన అనేకసార్లు అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లారు. పార్టీ విధేయతలకు అతీతంగా అన్ని పార్టీల నేతలతో జైట్లీ సన్నిహితంగా ఉండేవారు. 90వ దశకం ద్వితీయార్థంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అశోకా రోడ్‌లోని జైట్లీ అధికార భవనంలోనే ఉండేవారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌ను తొలగించి మోదీని ముఖ్యమంత్రిగా చేయడంలో జైట్లీ పాత్ర ఎంతో ఉంది. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీని ఆయన గట్టిగా సమర్థించారు. బీజేపీ జాతీయ నాయకులు భిన్న స్వరాలు వినిపించినా జైట్లీ మాత్రం మోదీ తరపునే వాదించారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన జైట్లీ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఎమర్జెన్సీ కాలంలో పనిచేశారు.