జాతీయ వార్తలు

క్రూరంగా ప్రవర్తించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించాలనుకొనే ప్రతిపక్ష పార్టీలు, మీడియాపై ప్రభుత్వం చాలా క్రూరంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఆదివారం ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం నేపథ్యంలో శనివారం అక్కడ పర్యటించి ప్రజల స్థితి గతులు తెలుసుకోవాలన్న కాంగ్రెస్‌తో పాటు మీడియాపై అణగదొక్కే విధంగా వ్యవహరించి శ్రీనగర్ విమానాశ్రయంలో అడ్డుకొని ఢిల్లీకి వెనక్కి పంపారని పేర్కొన్నారు.
గత 20 రోజులుగా జమ్మూ కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛను రాష్ట్ర పాలనా యంత్రాంగం హరించడమే కాకుండా వారి రాజ్యాంగ పరమైన హక్కులను సైతం కుదించివేసిందని ఆరోపించారు. శనివారం శ్రీనగర్ పర్యటన కోసం వెళ్లిన రాహుల్ గాంధీ వారికి ఎదురైన అనుభవాలను వీడియోలో చిత్రీకరించి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. శ్రీనగర్ వెళ్లిన నేతలతో పాటు మీడియాపై అక్కడి ప్రభుత్వం ఎంత క్రూరంగా దాడులకు దిగిందో తెలియజేసే దృశ్యాలను వీడియోలో చూపారు. మీడియా, నేతలపై చేయి చేసుకోవడం ఎంతవరకు సబబని రాహుల్ ప్రశ్నించారు. రాహుల్‌తో పాటు శ్రీనగర్‌కు వెళ్లిన వారిలో సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఎన్‌సీపీ, జేడీ ఎస్, ఆర్‌జేడీ, ఎల్‌జేడీ, టీఎంసీ నేతలున్నారు. ఇందులో కాశ్మీర్ స్థానికుడైన గులాంనబీ ఆజాద్‌తో పాటు ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులున్నారు.
రాజకీయం చేయడం లేదు: ప్రియాంక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ అంశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంతో జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. రాజకీయం చేయడం లేదని, జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడడం లేదని ఆమె తెలిపారు. కాశ్మీర్ అంశాన్ని ఎలుగెత్తి ఎండగట్టడంలో తాము వెనుకడుగు వేసేది లేదని ఆమె చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-370ని రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఇంకా ప్రతిపక్షాల నాయకులు ప్రజల మనోభావాలు స్వయంగా తెలుసుకునేందుకు కాశ్మీర్ వ్యాలీకి చేరుకున్నారు. అయితే శ్రీనగర్‌లోనే అధికారులు వారిని అడ్డగించి, పర్యటనకు అనుమతి లేదని చెప్పి అక్కడి నుంచి దేశ రాజధానికి తిరిగి పంపించిన సంగతి తెలిసిందే.
ఇలాఉండగా దీనిపై ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో క్లిప్పింగ్‌ను కూడా అందులో పోస్ట్ చేశారు. విమానాశ్రయంలో ఓ మహిళ తాము పడుతున్న కష్టాల గురించి రాహుల్ గాంధీకి మొర పెట్టుకుంటున్నట్లు ఆ వీడియోలో ఉంది. తాము ఎన్నో కష్టాలు అనుభవించామని, ఇంకా ఎన్నాళ్లీ ఘాతుకాలనీ ఆ మహిళ రాహుల్‌కు చెప్పారని ప్రియాంక పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కొంత మంది నాయకులు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. ఎంత కాలం ఇలా ప్రజాస్వామ్య హక్కులను మూసి వేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో తాము వౌనంగా ఉండలేమని, ప్రజల పక్షాన నిలబడి వారి గొంతును వినిపిస్తామని ఆమె తెలిపారు. జమ్మూ-కాశ్మీర్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ప్రియాంక పేర్కొన్నారు. ఇలాఉండగా జమ్మూ-కాశ్మీర్ ముఖ్య కార్యదర్శి రోహిత్ కన్సాల్ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ శాంతి-్భద్రతలకు విఘాతం కలగరాదన్న ఉద్దేశ్యంతోనే ప్రతిపక్షాల నేతలను అనుమతించలేదని చెప్పారు. వారిని రావద్దని ముందుగానే కోరడం జరిగిందని ఆయన తెలిపారు. పైగా భారత్-పాక్ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని, పాక్ దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని రోహిత్ కన్సాల్ వివరించారు.

చిత్రం...కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ