జాతీయ వార్తలు

ప్లాస్టిక్‌కు పాతరేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఒకే ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నిరోధించేందుకు అందరూ ఏకం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రధాని మోదీ తన ‘మనసులోని మాట’ను దేశ ప్రజలకు వినిపిస్తూ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి ఉపయోగించుకోవచ్చునని.. ఇంధనంగా మార్చుకోవచ్చునని అన్నారు. ప్రజలు పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హితవు చెప్పారు. సత్యం, ధర్మానికి కట్టుబడి పనిచేసిన మహాత్మా గాంధీ మనందరికీ ఆదర్శనీయుడని అన్నారు. ‘సేవే పరమో ధర్మః’ అనే దానికి మహత్మా గాంధీ ప్రాధాన్యత ఇచ్చారని.. ‘కృష్ణం వందే జగద్గురుం’ అంటూ జగద్గురువైన శ్రీకృష్ణుడు యమునా నదీ ప్రాంతం నుండి ద్వారకకు వెళితే జాతిపిత మహాత్మా గాంధీ ద్వారక నుంచి యమునా తీరానికి వచ్చి పని చేశారని.. ఇక్కడే అసువులు బాసారని నరేంద్ర మోదీ చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు సెప్టెంబర్ 11న ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.. దీనిద్వారా ప్లాస్టిక్ విముక్త భారతదేశం కలను సాకారాం చేసేందుకు ప్రయత్నిస్తామని నరేంద్ర మోదీ వివరించారు. సెప్టెంబర్ నెలంతా ‘పోషణ ఉద్యమం’ నిర్వహిస్తామన్నారు. ప్రజలందరికీ సమతూక, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేసే కార్యక్రమమే పోషణ ఉద్యమమని ఆయన తెలిపారు. ఆహారం విషయంలో మనకున్న జ్ఞానాన్ని ఒక సైన్సుగా మార్చివేశామన్నారు. మహిళా క్లబ్బులు నిర్వహించే వారు కూడా స్వచ్చతా కార్యక్రమాన్ని చేపట్టటం ద్వారా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించాలని ప్రధాన మంత్రి సూచించారు. పాత పుస్తకాలు సేకరించి పేద ప్రజలకు పంపిణీ చేయటం ద్వారా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించాలని నరేంద్ర మోదీ చెప్పారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా రానున్న గురువారం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల డిస్కవరీ చానల్‌లో ప్రసారమైన ‘మనిషి-అడవి’ కార్యక్రమంలో తన హిందీ మాటలను బియర్ గ్రిల్స్ వెంటనే ఎలా అర్థం చేసుకునేవారన్న ప్రశ్నకు నరేంద్ర మోదీ వివరణ ఇస్తూ- బియర్ గ్రిల్స్ చెవిలో పెట్టుకున్న ఒక ఆధునిక యంత్రం తాను పలికిన హిందీ పదాలను వెంటనే ఇంగ్లీషులోకి తర్జుమా చేసి వినిపించేది.. అందుకే తామిద్దరం వేర్వేరు భాషల్లో మాట్లాడినా ఇద్దరికీ అర్థమయ్యేదని ప్రధాన మంత్రి వివరించారు. ప్రకృతిని అర్థం చేసుకునేందుకు జిమ్ కార్బేట్ పార్క్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు. రానున్న మూడేళ్ల కాలంలో దేశంలోని పదిహేను పర్యాటక ప్రాంతాలను దర్శించాలని ఆయన దేశ ప్రజలను కోరారు. దేశంలో ప్రస్తుతం 2,967 పులులున్నాయని.. 2022లో ఆ సంఖ్యను రెండింతల చేయాలన్న లక్ష్యాన్ని తామిప్పుడే సాధించామని అన్నారు.
నూతన భారతదేశంలో లక్ష్యాలను వీలున్నంత త్వరగా సాధిస్తున్నామని.. తాను వెళ్లిన ప్రతిచోటా యోగా గురించి వాకబు చేస్తున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోని ప్రతి పెద్ద నాయకుడు తనతో యోగా గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పుడు చాలామంది తనను వన్యప్రాణుల గురించి అడుగుతున్నారని అన్నారు.