జాతీయ వార్తలు

‘కాకతీయ’ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: జలవనరులను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కాకతీయ మిషన్’ ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రారంభించిన ‘కాకతీయ మిషన్’ను ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 4నుంచి ‘నాల్గవ జాతీయ జల వారోత్సవాల’ను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నీటివనరుల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాలను కేంద్రం ఆసక్తిగా గమినిస్తున్నట్లు వివరించారు. జల సంరక్షణలో ఇజ్రాయిల్ సాధించిన విజయాలను మంత్రి ప్రస్తావిస్తూ, మంచి కార్యక్రమాలను ఎవరు చేపట్టినా వాటిని అనుసరించడంలో తప్పేమీలేదన్నారు. కాకతీయ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆమె ఇతర రాష్ట్రాలకు సూచించారు.