జాతీయ వార్తలు

14నుంచి ప్రధాని బహుమతుల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: వేర్వేరు సంస్థల నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన రెండు వేల 700 బహుమతులను ఈనెల 14 నుంచి వేలం వేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ బుధవారం పేర్కొన్నారు. రెండు వేల 772 బహుమతులను ఆన్‌లైన్‌లో వేస్తున్నట్లు ఆయన చెప్పారు. వీటి కనీస ధర 200 రూపాయిలు కాగా.. గరిష్ట ధర రెండున్నర లక్షల రూపాయిలు ఉంటుందని చెప్పారు. జనవరి నెలలో కేవలం 15 రోజుల్లో ప్రధాని మోదీకి వచ్చిన 1800 బహుమతులను వేలం వేసినట్లు చెప్పారు. ఈ నిధులను ‘నమామి గంగే’ పేరుతో గంగానది ప్రక్షాళనకు వినియోగించినట్లు మంత్రి వివరించారు.