జాతీయ వార్తలు

పెన్షన్ పథకం...జాతికి అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, సెప్టెంబర్ 11: రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (12న) జాతికి అంకితం చేయనున్నారు. ‘ప్రధాన మంత్రి కిసాన్ మంథన్ యోజన’ కింద చేపట్టిన పథకాన్ని గురువారం జార్ఖండ్‌లోని ప్రభాత్ తారా గ్రౌండ్‌లో జరగబోయే బహిరంగ సభలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ఈ పథకం కింద 18 నుంచి 40 ఏళ్ళ లోపు వారు చేరితే, వారు 60 సంవత్సరాల వయస్సు రాగానే నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనుండడం గమనార్హం. అదేవిధంగా ప్రధాని మోదీ ‘ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మంథన్ యోజన’, ‘స్వరోజ్‌గార్’ పెన్షన్ పథకాలనూ ప్రారంభిస్తారు. ఈ పథకం కింద కూడా 18 నుంచి 40 ఏళ్ళ లోపు వారు 60 ఏళ్ళకు వచ్చిన తర్వాత నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది. జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబార్ దాస్, గవర్నర్ ద్రౌపాడి ముర్ము, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, రాంఛీ ఎంపీ సంజయ్ సేథ్, ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రణ్‌ధీర్ సింగ్, ఆ రాష్ట్ర ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాన మంత్రి కిసాన్ మంథన్ యోజన కింద 1,16,183 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ తెలిపారు. ఇలాఉండగా అత్యాధునికంగా నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అదేవిధంగా సాహిబ్‌గంజ్ ప్రాంతంలో నిర్మించిన మల్టీ-మాడల్ టెర్మినల్‌నూ ప్రధాని ప్రారంభిస్తారు. నూతనంగా నిర్మించనున్న రాష్ట్ర సచివాలయ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.