జాతీయ వార్తలు

ప్రధాని ముఖ్య కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ మిశ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. గతంలో కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన ప్రదీప్ కుమార్ సిన్హాను ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియిమించారు. 71 ఏళ్ల మిశ్రా 1972 గుజరాత్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన బుధవారం కొత్త బాధ్యతలు స్వీకరించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మిశ్రా గతంలో ప్రధానికి అడిషనల్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉంది. ఇటీవల నృపేంద్ర మిశ్రా వైదొలగడంతో ప్రమోద్ మిశ్రాకు ఆ బాధ్యతలను ప్రభుత్వం కట్టబెట్టింది. 2014-19 మధ్యకాలంలో ప్రధానికి సహాయ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన కాలంలో మి శ్రా పలు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా మానవ వనరుల నిర్వహణ విభాగంలో ఆయన సరికొత్త మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి సీనియర్ స్థానాల్లో జరిగే నియామకాల్లో ఆయన విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ, విద్యుత్, వౌలిక సదుపాయాలు, ఆర్థిక సంస్థల పనితీరు వంటి పలు అంశాల్లో చేసిన కృషి దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు సంపాదించి పెట్టింది. కాగా, 64 ఏళ్ల మాజీ కేబినెట్ కార్యదర్శి సిన్హా గత నెల ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూ టీ (ఓఎస్‌డీ)గా ప్రధాని కార్యాలయంలో నియమితులయ్యారు. బుధవారం ఆయన కేబినెట్ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.