జాతీయ వార్తలు

పాక్‌లోనే ఉగ్ర మూలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర: ప్రపంచంలో ఉగ్ర దాడులు ఎక్కడ జరిగినా వాటి మూలాలు మాత్రం పాకిస్తాన్‌లో ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై జరిగిన 3సెప్టెంబర్ 112 దాడులను ఆయన ప్రస్తావిస్తూ దాని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అన్నారు. పొరుగు దేశం నుంచి ఉగ్ర దాడుల ప్రమాదం ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అన్నివిధాల సంసిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్‌ఏడీసీపీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 3ఇటీవల కాలంలో ఉగ్రవాదం అనేది ప్రతి సరిహద్దులోనూ ఒక విధానంగా మారింది. ఇది కేవలం ఏ ఒక్క దేశానికో లేదా ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఉగ్రవాద మూలాలు మన పొరుగుదేశంలోనే ఉన్నాయి2 అని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం ఇస్తున్న వర్గాల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ప్రపం చ దేశాలు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కఠినాతి
కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే సెప్టెంబర్ 11 తరహా దాడులు ఎక్కడైనా జరుగవచ్చని ఆయన హెచ్చరించారు.
ప్లాస్టిక్‌ను త్యజించండి
ఏరకంగానూ ప్లాస్టిక్‌ను వాడకుండా త్యజించాలని ప్రధాని మోదీ అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ సమతుల్యానికి విఘాతం ఏర్పడుతోందని ఆయన అన్నారు. భారీ సంఖ్యలో జంతువులు, పక్షులు మృతి చెందుతున్నాయని ఆయన అన్నారు. చివరికి జల కాలుష్యం వల్ల చేపలు కూడా బతికే పరిస్థితి లేదని 3స్వచ్ఛతా హి సేవా2 (స్వచ్ఛతే సేవ) కార్యక్రమాన్ని బుధవారం ఇక్కడ ప్రారంభించిన ఆయన ఆహూతులను ఉద్దేశించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్గారాల నియంత్రణ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఆయన అన్నారు. ఈ ఉద్యమానికి కేంద్రం నూరు శాతం అందిస్తోందని ఆయన ప్రకటించారు. 2024 సంవత్సరాంతానికి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించి, పర్యావరణ పరిరక్షణకు 12,652 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. స్వచ్ఛ భారత్ నినాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పేర్కొన్నారు.

3ఆవు, ఓం వంటి పదాలు వింటే కొంతమందికి దిగ్భ్రాంతికి గురవుతారు. ఇది చాలా దురదృష్టకరం. గోమాతను పూజించడం మన సంప్రదాయం. ఓంకార నాదం విశ్వానికి మూలం. ఈ రెండు పదాలను వింటే కొంతమంది ఎందుకు హడలెత్తిపోతున్నారో అర్థం కావడం లేదు2.