జాతీయ వార్తలు

హిమాచల్ గవర్నర్‌గా దత్తన్న ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర 27వ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని సిమ్లాలోని రాజ్‌భవన్‌లో బుధవారం ప్రమాణస్వీకార వేడుక ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు దత్తాత్రేయతో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ధరమ్ చంద్ చౌదరి ప్రమాణం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాంఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి,
దత్తాత్రేయ కుటుంబ సభ్యులు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దత్తాత్రేయ విలేఖరులతో మాట్లాడుతూ తనకు గవర్నన్‌గా అవకాశం కల్పించినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన హిమాచల్‌ప్రదేశ్‌కి గవర్నర్‌గా నియమించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు. పర్యాటక రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన హిమాచల్‌ప్రదేశ్ దేశానికే గర్వకారణమన్నారు. ఇక్క యువతకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తానని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానం చేసే విధంగా వ్యవహరిస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందే విధంగా సర్కారుకు సలహాలు ఇస్తానని గవర్నర్ ప్రకటించారు. తాను ఎలాంటి పదవిలో ఉన్న ప్రజలతో మమేకం అవ్వడమే తెలుసని దత్తాత్రేయ చెప్పారు. ఇక ముందుకు అదే పంథాను కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.
చిత్రం... సిమ్లాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న దత్తాత్రేయ