జాతీయ వార్తలు

మద్రాస్ హైకోర్టు సీజే బదిలీపై నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 12: మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విజయ కే తహిల్మ్రణిని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ మహారాష్టల్రోని లాతూర్ జిల్లా బార్ అసోసియేషన్ శుక్రవారం విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. మరఠ్వాడా రీజియన్ పరిధిలోని లాతూర్‌కు చెందిన తహిల్ రమణిని సుప్రీంకోర్టు కొలీజియం మద్రాస్ హైకోర్టు నుంచి మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం దాదాపు 1800 మం దికి పైగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు లాతూ ర్ బార్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్, న్యాయవాది బాలాజీ పాంచల్ తెలిపారు. తహిల్ రమణి తన బదిలీని వెనక్కి తీసుకోవాలని కొలీజియంను కోరినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో గత వారం ఆమె రాజీనామా సమర్పించా రు. అయితే, ఆ రాజీనామా లేఖను ఆమోదించడం లేదా తిరస్కరించడం వంటి చర్యలేవీ కొలీజియం చేపట్టలేదు. లాతూర్ న్యాయవాదులు ఆమె బదిలీని వెనక్కి తీసుకోవడంతో పాటు రాజీనామాను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ జస్టిస్ రమణి 1958 సంవత్సరం అక్టోబర్ మూడో తేదీన లాతూర్‌లో జన్మించారు. లా డిగ్రీ పూర్తి చేసిన ఆమె మహారాష్ట్ర, గోవా బార్ అసోసియేషన్‌లో సభ్యత్వాన్ని పొందారు. తొలుత సిటీ సివిల్, సెషన్స్ కోర్టు న్యాయవాదిగా పనిచేసిన అనంతరం బాంబే హైకోర్టు న్యాయవాదిగా చేశారు. 1990 సంవత్సరం ఫిబ్రవరిలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన ఆమె అనంతరం బాబే హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా కూడా పనిచేశారు. తరువాత 2015లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈమె నేతృత్వంలోని డివిజన్ బెంచ్ బిల్కిస్ బానో గ్యాం గ్‌రేప్ కేసులో నిందితులు 12మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. బాంబే హైకోర్టు నుంచి 2018లో తహిల్మ్రణిని మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు.