జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లోనూ ప్రేరక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీని పటిష్టం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ పంథాలోనే నడుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్నట్లు జిల్లా, మండల స్థాయిలో కాంగ్రెస్‌లో ప్రేరక్‌లు రానున్నారు. ప్రేరక్‌ల ద్వారా పార్టీ సిద్దాంతాలను ప్రచారం చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం ఏఐసీసీలో జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు, పీసీసీ అధ్యక్షులు, సిఎల్‌పీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రేరక్‌లను నియమించటం ద్వారా తాము ఆర్‌ఎస్‌ఎస్‌ను కాపీ కొడుతున్నామంటూ వస్తున్న వార్తలోనిజం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌పీఎన్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నాయకుడు ఆర్‌పీఎన్ సింగ్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రేరక్ విధానం కాంగ్రెస్‌లో ఎప్పటి నుండో అమలులో ఉందని తెలిపారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ కంటే కాంగ్రెస్ ఎంతో పాత పార్టీ. పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు కాంగ్రెస్‌లో ప్రేరక్‌లు ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. ప్రేరక్‌లను నియమించాలని నిర్ణయించటం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ను కాపీ కొడుతున్నామనడంలో నిజంలేదు’అని ఆయన సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రేరక్‌లు జిల్లా, మండల స్థాయిలో ప్రజలను కలిసి కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తారని వారు వెల్లడించారు. పార్టీ విధానాలను వివరించటం ద్వారా వారు పార్టీలో చేరేందుకు ప్రేరణ కలిస్తారన్నారు. కాగా సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించవలసిన విధానాలపై చర్చించారు. అలాగే జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ చేపట్టవలసిన కార్యక్రమాలపైనా చర్చ జరిగిందని వేణుగోపాల్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున పాద యాత్రలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులందరూ ఈ పాద యాత్రల్లో పాల్గొని గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుందన్నారు. నిజమైన లౌకిక వాదం, జాతీయ వాదం గురించి ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వేణుగోపాల్ చెప్పారు. దేశంలో నెలకొంటున్న ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్ వచ్చే నెల ఆఖరు వారంలో దేశ వ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమం చేపడుతుందని ఆయన వెల్లడించారు.