జాతీయ వార్తలు

బయో టెర్రరిజంతో పెనుముపు ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: బయో టెర్రరిజం ఓ పెనుముప్పుగా మారుతోందని అందుకు సైనిక దళాలు అన్ని విధాలుగా సన్నద్దం కావాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. షాంఘై సహకార సంస్థ తొలి సైనిక వైద్య సదస్సులో గురువారం నాడు ఇక్కడ మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ ఈ కూటమి దేశాలు ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన రీతిలో వ్యవహరించాలన్నారు. యుద్ధ క్షేత్రంలో ఉండే సైనికులకు బయో టెర్రరిజం ఓ ప్లేగులా వ్యాపిస్తోందని రాజ్‌నాథ్ హెచ్చరించారు. ఆసియా-్ఫసిఫిక్ ప్రాంతంలో ఈ కూటమి చాలా బలంగా నిలదొక్కుకుందని పేర్కొన్న రాజ్‌నాథ్ దీన్ని ఓ బలమైన రక్షణ కవచంగా అభివర్ణించారు. బయో టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రాంతంలోని దేశాలు వైద్య పరంగా మరింత బలపడాలని తెలిపారు. ఇటు సైనిక దళాలు, అటు వైద్య సేవలు సమభాగస్వామ్యంతో ఈ జాఢ్యాన్ని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రపంచ వాతావరణంలో యుద్ధక్షేత్ర టెక్నాలజీ అనూహ్యంగా విస్తరిస్తోందని దీని కారణంగా ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు. ఇప్పటికే ఉన్న ఉవాళ్ల సంక్లిష్టతకు ఈ సాంప్రదాయేతర సవాళ్లు తోడయ్యాయయనీ, వీటిని ఇటు వైద్య అటు సైనిక శక్తితో షాంఘై కూటమి దేశాలు తిప్పికొట్టాలని ఉద్ఘాటించారు. ఈ కొత్త సవాళ్లను గుర్తించి దానికి అనుగుణంగా వైద్య సేవా విభాగాలు సమాయత్తం కావాలన్నారు. ఇప్పటికే ఆధునిక యుద్ధ తంత్రం అనేక సవాళ్లను తెరపైకి తెచ్చిందని వీటికి అను, రసాయన, జీవాయుధాలు కూడా తోడయ్యాయని రాజ్‌నాథ్ తెలిపారు. భారత్, చైనా, కజకస్థాన్, కరికిస్థాన్, పాకిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ తాజా సదస్సులో 20 అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, 40 భారతీయ బృందాలు పాల్గొంటున్నాయి. ఈ సమావేశానికి పాకిస్థాన్ హాజరు కాకపోవడంతో ఆ దేశ ప్రతినిధికి కేటాయించిన సీటు ఖాళీగా ఉండి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తోంది. ప్రపంచ జనాభా, భౌగోళిక పరిధిని దృష్టిలో పెట్టుకుంటే ప్రపంచంలోనే ఇది అత్యంత విస్తృతమైన ప్రాంతీయ కూటమి అని రాజ్‌నాథ్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కూటమిని బలోపేతం చేయడానికి భారత్ విస్తృతంగా కృషిచేస్తోందని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ కూటమి సవ్యదేశాల మధ్య సైనిక విన్యాసాలు కూడా నిరంతరం జరుగుతున్నాయని ఉగ్రవాదంతో పాటు అనేక సవాళ్లు ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహంతో పోరాడుతున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు.
చిత్రం...షాంఘై సహకార మండలి తొలి సైనిక వైద్య ప్రారంభ సదస్సును ఉద్దేశించి
గురువారం ఢిల్లీలో మాట్లాడుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్