జాతీయ వార్తలు

ఇస్రోకు అండగా నాసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 12: చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ అయిన తర్వాత జాడ లేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చివరి ప్రయత్నాలు మొదలుపెట్టింది. చంద్రుడిపై అచేతనంగా పడి ఉన్న విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాను రంగంలోకి దింపారు. రెండు రోజులుగా తమ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డీఎస్‌ఎన్) కేంద్రాల ద్వారా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (జేపీఎల్) చంద్రుడిపైకి రేడియో ప్రీక్వెన్సీ సంకేతాలు పంపినట్లు నాసా వర్గాలు వెల్లడించాయి. ఇస్రోతో కుదిరిన ఒప్పందం మేరకు డీఎస్‌ఎన్
సాయంతో విక్రమ్‌ను పలకరించేందుకు నాసా ప్రయత్నిస్తోంది. కేవలం మరో 9 రోజులు మాత్రమే ఇస్రోకు మిగిలింది. చంద్రయాన్-2 ఉపగ్రహంలో కీలక పేలోడ్ విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుని వద్దకు చేర్చే క్రమంలో ఈనెల 7న ల్యాండర్ నుంచి సంకేతాలు ఇస్రోకు తెగిపోయాయి. దీంతో అప్పటి నుంచి విశ్వ ప్రయత్నం చేస్తున్నా విక్రమ్ నుంచి సంకేతాలు మాత్రం అందడంలేదు. సరిగ్గా ఇక్కడ అంతర్జాతీయ స్పేస్ ఒప్పందాలతో నాసా శాస్తవ్రేత్తలు రంగంలోకి దిగారు. నాసాకు చెందిన డీప్ స్పేషన్ల ద్వారా ల్యాండర్ నుంచి సంకేతాలు అందుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న ఎన్నో సందర్భాల్లో పలు దేశాలకు ఇస్రో అంతర్జాతీయ ఒప్పందాల నేపధ్యంలో ఉపగ్రహం సేవలను అందించిం. ఇదే క్రమంలో చంద్రుని వద్దకు ఉపగ్రహాలను చేర్చిన ఘనతను సాధించిన దేశం కావడంతో నాసా తమ సాంకేతికత సామర్థ్యంతో చంద్రయాన్-2కు చెందిన విక్రమ్ ల్యాండర్ పేలోడ్ నుంచి సంకేతాలు అందుకునేందుకు కొంతమంది ప్రత్యేక శాస్తవ్రేత్తల బృందం తలమునకలై ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి వుంటే ఈనెల 7వ తేదీన చంద్రుని వద్దకు విక్రమ్ చేరుకున్న అనంతరం 1 లూనార్ డేలో (14 రోజులు) అక్కడ వాతావరణంపై అధ్యయాన్ని ఇస్రో చేపట్టి ఉండేది. అనూహ్యంగా భూమి నుంచి 3,84,400 కిలోమీటర్ల దూరంలోని చంద్రుని వద్దకు చేరుకునే క్రమంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఇస్రో రాడార్ కేంద్రాలకు సంకేతాలు తెగిపోయాయి. ఇందుకోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ సాధ్యపడడం లేదు. దీంతో నాసా శాస్తవ్రేత్తలు రంగంలోకి దిగారు. విక్రమ్ జీవితకాలం 14 రోజులే కావడంతో దానితో సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు రోజు రోజుకూ తగ్గిపోతున్నాయి. ల్యాండర్‌పై సూర్యకిరణాలు తాకే ఈ రెండు వారాలు ఈనెల 20-21 మధ్య ముగుస్తాయి. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్‌లో ఉండే సోలార్ ప్యానెళ్లను ఉత్తేజపర్చడంపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. కాగా ఔత్సాహిక నాసా శాస్తవ్రేత్త స్కాట్ టిల్లే సైతం విక్రమ్ ల్యాండర్‌కు సంకేతాలు పంపుతున్న విషయాన్ని ధృవీకరించారు. కాలిఫోర్నియాలోని నాసా డీఎస్‌ఎన్ కేంద్రం విక్రమ్ ల్యాండర్‌కు శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాలు పంపినట్లు వెల్లడించారు. చంద్రయాన్-2కి చెందిన విక్రమ్ ల్యాండర్‌ను ఉత్తేజపర్చేందుకు డీఎస్‌ఎన్ 24 బీమ్స్ 12 కిలోవాట్ల రేడియో ఫ్రీక్వెన్సీని నాసా చంద్రుడి పైకి పంపించింది. ఈఎంఈ (ఎర్త్ మూన్ ఎర్త్) మీదుగా 2103.7 మెగా హెడ్జిల నాసా సిగ్నల్ చంద్రుడిపై పడి తిరిగి భూమికి చేరిందంటూ ఆయన ట్వీట్ చేశారు. దీని తాలూకు రికార్డింగ్‌ను కూడా అయన ఈ ట్వీట్‌కు జత చేశారు. అనేక కారణాల రీత్యా భారత్ చేపట్టిన చంద్రయాన్-2పై అమెరికా కూడా విశేష ఆసక్తి కనబరుస్తోంది. విక్రమ్ ల్యాండర్‌కి అమర్చిన లేజర్ రిఫ్లెక్టర్ ద్వారా భూమి నుంచి చంద్రుడికి కచ్చితంగా ఎంత దూరం ఉందో అంచనా వెయ్యవచ్చు. నాసా తదుపరి పరిశోధనలకు ఈ సమాచారం ఎంతగానో ఉపకరిస్తుంది. కాగా ఎనిమిది అధునాతన పేలోడ్స్‌తో కూడిన చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి అందే డేటా కోసం కూడా నాసా చాలా ఆశలు పెట్టుకుంది. చంద్రుడి దక్షిణ ధృవానికి సంబంధించిన స్పష్టమైన చిత్రాలతో పాటు 3డీ మ్యాపింగ్ కోసం నాసా ఎదురుచూస్తోంది. 2024 నాటికి చంద్రుడి దక్షిణ ధృవం పైకి మానవ సహిత ప్రయోగం చేపట్టనుండడంతో నాసాకు ఈ సమాచారం అత్యంత కీలకంగా మారింది. ఇక కేవలం మిగిలింది 9 రోజులు మాత్రమే. సెప్టెంబర్ 21వ తేదీ లోగా ల్యాండర్ నుంచి సంకేతాలు రాకపోతే శాశ్వతంగా చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగానికి తెరపడినట్లే.